సీపీజీఈటీ వెరిఫికేషన్​ రేపటితో ఆఖరు

సీపీజీఈటీ వెరిఫికేషన్​ రేపటితో ఆఖరు

కామన్‌ పోస్ట్​గ్రాడ్యుయేట్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (సీపీజీఈటీ) సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ఈ నెల 24తో ముగుస్తుందని సెట్  కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కిషన్‌ తెలిపారు. ఈ నెల16 నుంచి ప్రారంభమైన వెరిఫికేషన్​.. ఇప్పటి వరకు 21 సబ్జెక్టులకు సంబంధించి పూర్తి చేశామన్నారు. మరో 23 సబ్జెక్టులకు చెందిన కొందరు స్టూడెంట్స్‌ సర్టిఫికెట్లు వెరిఫికేషన్‌ చేయాలన్నారు. సీపీజీఈటీలో 39 వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా, ఇప్పటి వరకూ 27,580 మంది సర్టిఫికెట్ వెరిఫికేషన్‌లో పాల్గొన్నారని చెప్పారు.