నకిలీ మద్యాన్ని గుర్తించేందుకు ‘వేరిట్’ యాప్​ను వాడాలి : సీఐ గీత

నకిలీ మద్యాన్ని గుర్తించేందుకు ‘వేరిట్’ యాప్​ను వాడాలి : సీఐ గీత

బషీర్​బాగ్, వెలుగు: నకిలీ మద్యాన్ని గుర్తించేందుకు రూపొందించిన ‘వేరిట్’ యాప్​ను వినియోగించుకోవాలని నారాయణగూడ ఎక్సైజ్ సీఐ గీత శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్లే స్టోర్ నుంచి ఈ యాప్​ను డౌన్​లోడ్ చేసుకొని మద్యం బాటిల్ తెలంగాణ రాష్ట్రానికి చెందినదా కాదా అనే విషయం తెలుసుకోవచ్చునని ఆమె తెలిపారు.

బాటిల్​పై ఉన్న క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే అది ఏ రాష్ట్రానికి చెందిందో తెలియడంతో పాటు ఒరిజినల్ లేక నకిలీనా అనే విషయం కూడా నిర్దారణ అవుతుందన్నారు. అక్రమ మద్యం నిల్వలపై సమాచారం తెలిస్తే  టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-2523కు కాల్ చేయాలన్నారు.