
మహారాష్ట్రలోని ముంబై సహా పలు జిల్లాలకు అత్యంత భారీ వర్ష హెచ్చరిక చేసింది భారత వాతావరణ శాఖ. జులై 8, 9 , 10 తేదీల్లో ముంబై, రాయ్ గఢ్, థానే, పాల్గఢ్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని సూచించింది.
ఇప్పటికే భారీవర్షాలతో ముంబై మహానగరం వణికిపోతోంది. ఇటీవల వర్షాలు, వరదధాటికి ఇంకా కోలుకోలేదు. తాజాగా వాతావరణ శాఖ హెచ్చరికతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. ముంబైతోపాటు… మిగతా జిల్లాల్లోనూ అత్యవసర చర్యలకు ఆదేశాలు జారీచేసింది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేసింది.