
బాలీవుడ్ ప్రముఖ నటుడు రణధీర్ కపూర్ కరోనా బారిన పడ్డారు. దీంతో కుటుంబసభ్యులు ఆయన్ను ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని... ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు తెలిపారు. తనతో పాటు తన స్టాఫ్ ఐదుగురికి కరోనా సోకిందని తెలిపిన రణధీర్.. ముందస్తు జాగ్రత్తగా ఆసుపత్రిలో చేరారని చెప్పారు.తనకు ఎలాంటి ఇబ్బంది లేదని ఆక్సిజన్ సాయం కూడా తీసుకోవడం లేదన్నారు. 74 ఏళ్ల రణధీర్ కపూర్ ఇటీవలే రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు.