బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం

బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం

భారత చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. బాలీవుడ్ వెటరన్ యాక్టర్ సమీర్ ఖాకర్(71) కన్నుమూశారు.  మార్చి 14న ఉదయం నుంచి శ్వాస కోస  సమస్యతో బాధపడుతున్న సమీర్  చికిత్స పొందుతూ మార్చి 15న  ఉదయం 4.30 గంటలకు తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన తమ్ముడు గణేష్ ఖాకర్ తెలిపారు.

దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ప్రముఖ రంగస్థల, చలనచిత్ర,టీవీ నటుడిగా సమీర్ గుర్తింపు తెచ్చుకున్నారు. కమల్ హాసన్ నటించిన పుష్పక విమానం, సల్మాన్ ఖాన్ నటించిన జైహో , పరిందా,మసూమ్ ,రాజాబాబు, వంటి పలు హిట్ సినిమాల్లో ఖాకర్ నటించారు.