తెలుగులో దాసరి లాగే... తమిళ్ లో భారతీరాజా ప్రస్థానం...

తెలుగులో దాసరి లాగే... తమిళ్ లో భారతీరాజా ప్రస్థానం...

దర్శక దిగ్గజం భారతీరాజా మృతితో తమిళ చిత్రసీమలో తీవ్ర విషాదం నెలకొంది. 86 ఏళ్ళ వయసులో వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ... బుధవారం ( జూన్ 10 ) తెల్లవారుజామున కన్నుమూశారు. 

భారతీరాజా తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా సీతాకోకచిలుక, ఆరాధన, జమదగ్ని లాంటి అద్భుతమైన సినిమాలకు దర్శకత్వం వహించారు. కేవలం దర్శకుడిగా కాకుండా నటుడిగా కూడా మెప్పించారు భారతీరాజా. తెలుగు దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు లాగానే తమిళ్ లో భారతీరాజా ప్రస్థానం సాగిందని చెప్పచ్చు.

తమిళ్ లో యువ, సీతాకత్తి, ఈశ్వరన్, సర్, తీరు, మహారాజా వంటి సినిమాల్లో కీలక పత్రల్లో నటించారు భారతీరాజా. 2020లో రిలీజైన మీండుం ఒరు మరియాదై అనే మూవీకి చివరిగా దర్శకత్వం వహించారు భారతీరాజా. ఈ సినిమా తర్వాత డైరెక్షన్ కి దూరంగా ఉన్నారు భారతీరాజా. మోహన్ లాల్ నటించిన తుడురుమ్ సినిమాలో చివరిసారిగా వెండితెరపై కనిపించారు భారతీరాజా.