మీకు దండం పెడతా.. రష్మికపై ట్రోలింగ్ ఆపండి

మీకు దండం పెడతా.. రష్మికపై ట్రోలింగ్ ఆపండి

కన్నడ నటి దివ్య స్పందన ఇటీవలే కర్ణాటకలోని బెంగళూరులో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొంది. ఇందులో భాగంగా ఇపుడున్న డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ట్రోలింగ్ మహిళా నటీమణులపై ఎంతలా ప్రభావం చూపుతుందనే విషయంపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

మహిళలు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారని కాబట్టి సోషల్ మీడియాలో వారిపై ట్రోలింగ్ ఆపాలని కోరింది. ఈమధ్య కాలంలో నేషనల్ క్రష్ రష్మిక మందాన ఎక్కువగా నెగిటివ్ ట్రోలింగ్ కి గురైందని అయినప్పటికీ ఆమె చాలా హుందాగా స్పందిస్తూ ట్రోల్స్ ని యాక్సెప్ట్ చేసిందని చెప్పుకొచ్చింది. స్టేజీమీద ఆమె నేటివ్ ప్లేస్ గురించి మాట్లాడుతూ హైదరాబాద్ అని చెప్పినందుకు ఆమెపై పగబట్టి ట్రోల్ చేశారని ఇది సరికాదని అభిప్రాయం వ్యక్తం చేసింది. ట్రోల్ చేసేవారు మహిళలు ఎదుర్కొనే మానసిక క్షోభను కూడా అర్థం చేసుకోవాలని తెలిపింది. కాబట్టి ఇకనైనా రష్మికపై ట్రోలింగ్ ఆపాలని రిక్వెస్ట్ చేసింది.

ALSO READ | Abhinaya Engagement: పెళ్లి చేసుకోబోతున్న స్టార్ హీరోయిన్.. వరుడు ఆ స్టార్ హీరోనేనా..?

అయితే రష్మిక మందాన ఇటీవలే నటించిన "ఛావా" ప్రమోషన్స్ లో తన సొంతూరు హైదరాబాద్ అని పొరపాటున చెప్పింది.. ఈ సంఘటన తర్వాత కన్నడ సినీ పరిశ్రమకి చెందిన ఓ ఈవెంట్ లో పాల్గొనడానికి ఇన్విటేషన్ పంపించగా రష్మిక పెద్దగా పట్టించుకోలేదని దీంతో మెల్లమెల్లగా కన్నడ సినీ పరిశ్రమని పక్కన పెడుతోందని పుకార్లు వినిపించాయి. దీంతో కొందరు కన్నడ ఫ్యాన్స్ రష్మిక ని సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారు.. అయినప్పటికీ రష్మిక మాత్రం చాలా కూల్ గా ఈ ట్రోలింగ్ పై స్పందించింది. 

ఇందులో భాగంగా తన ధికారిక ఇన్స్టాగ్రామ్ లో "సాధ్యమైనంత సానుకూలంగా ఉండటానికి ప్రయత్నించండి, నవ్వండి - మనకు ఈ ఒక్క జీవితం మాత్రమే ఉంది కాబట్టి దాన్ని పూర్తిగా జీవించండి.. కొంచెం దయగా ఉండండి.. ప్రతి ఒక్కరూ తమదైన రీతిలో కష్టాలను ఎదుర్కొంటున్నారు.. ఇతరులకు ప్రేమను ఇవ్వండి, మీపై ప్రేమను ఇవ్వండి. మరియు వీలైనంత హైడ్రేట్ చేయండి మరియు మీ శరీరాలపై ప్రేమను ఇవ్వండి." అంటూ పోస్ట్ ని షేర్ చేసింది.

ఈ విషయం ఇలా ఉండగా నటి రష్మిక ఈమధ్య వరుస హిట్లు అందుకుంటూ దూసుకుపోతోంది. గత ఏడాది చివరలో వచ్చిన పుష్ప 2: ది రూల్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వగా ఈ ఏడాది ఛావా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.. ప్రస్తుతం రష్మిక హిందీలో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న సికిందర్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.. ఈ సినిమా ఈద్ సందర్బంగా మార్చి 28న థియేటర్స్ లోకి రానుంది..