
న్యూఢిల్లీ: ఇండియా విమెన్స్ టీమ్ బ్యాటర్ వేదా కృష్ణమూర్తి ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్‌కు శుక్రవారం గుడ్‌బై చెప్పింది. అయితే ఏదో ఓ పాత్రలో క్రికెట్‌తోనే కొనసాగుతానని తెలిపింది. కెరీర్‌లో 48 వన్డేలు, 76 టీ20లు ఆడిన వేద.. 829, 875 రన్స్ చేసింది. ‘చిన్న టౌన్ నుంచి పెద్ద కలలతో వచ్చిన నేను ఇండియా జెర్సీని ధరించడం చాలా గర్వంగా ఉంది. నాకు పాఠాలు, ప్రజలు, జ్ఞాపకాలు ఇచ్చిన క్రికెట్‌కు కృతజ్ఞతలు. కెరీర్‌కు వీడ్కోలు చెప్పే సమయమే కానీ ఆటకు మాత్రం కాదు. ఎల్లప్పుడూ జట్టు కోసం, ఇండియా కోసమే ఆడా’ అని వేద సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
కర్నాటక మాజీ క్రికెటర్ అర్జున్ హొయసలను వివాహం చేసుకున్న 32 ఏండ్ల వేద.. 2020లో మెల్‌బోర్న్‌లో చివరిసారి ఇండియా తరఫున ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో బరిలోకి దిగింది. 2018లో చివరి వన్డే ఆడింది. హార్డ్ హిట్టర్‌గా పేరు తెచ్చుకున్న వేద.. గతేడాది విమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ తరఫున ఆడింది. ఇక వ్యక్తిగత జీవితంలోనూ వేద గొప్ప పోరాటం చేసింది. కొవిడ్ టైమ్‌లో ఆమె తన తల్లి చెలువమాబా దేవి, సోదరి వత్సల శివకుమార్‌ను కోల్పోయినా ధైర్యంతో కెరీర్‌ను కొనసాగించింది.