
ప్రముఖ తమిళ చిత్ర నిర్మాత, నటుడు, దర్శకుడు వేలు ప్రభాకరన్ (68) కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం (జులై18న) తుదిశ్వాస విడిచారు.
శనివారం (జూలై 19) సాయంత్రం నుండి ఆదివారం మధ్యాహ్నం (జూలై 20) వరకు చెన్నైలోని వలసరవక్కంలో ఆయన భౌతికకాయాన్నికి ప్రజల నివాళులర్పిస్తారు. ఆదివారం సాయంత్రం పోరూర్ శ్మశానవాటికలో కుటుంబ సభ్యులు మరియు సన్నిహితుల సమక్షంలో అంత్యక్రియలు జరగనున్నాయి.
ALSO READ : BakasuraRestaurant: కమెడియన్ ప్రవీణ్ హంగర్ కామెడీ.. ఆగస్టులో ‘బకాసుర రెస్టారెంట్’
వేలు ప్రభాకరన్ రెండుసార్లు వివాహం చేసుకున్నాడు. అతని మొదటి భార్య పేరు పి. జయదేవి. ఆ తర్వాత, అతను 2017లో 60 సంవత్సరాల వయసులో రెండవసారి వివాహం చేసుకున్నాడు. అతను తన కంటే 25 సంవత్సరాలు చిన్నదైన చెర్లీ దాస్ అనే మహిళను వివాహం చేసుకుని కొన్నాళ్ళు చర్చగా మారాడు. ప్రభాకరన్ మృతిపట్ల సినీ పరిశ్రమ ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తోంది.
#VeluPrabhakaran married #ShirlyDas heroine of his 2009 film #VeluPrabhakarinKadhalKadhai as his new #OIKD released pic.twitter.com/GRp1MFFxZK
— Sreedhar Pillai (@sri50) June 3, 2017
వేలు ప్రభాకరన్ను పెరియారిస్ట్ అని పిలుస్తారు. ఆయన పెరియార్పై టెలివిజన్ చర్చలలో తరుచూ పాల్గొనేవారు. యూట్యూబ్లో ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. ఆయన తన సినిమాల్లో దేవుడిని తిరస్కరించడం మరియు నాస్తికత్వంపై అభిప్రాయాలను వ్యక్తం చేశారు. తమిళ సినిమాలో దర్శకుడిగా, సినిమాటోగ్రాఫర్‌గా వివిధ రంగాలలో వేలు ప్రభాకరన్ తనదైన ముద్ర వేశాడు.
వేలు ప్రభాకరన్ సినీ ప్రస్థానం:
వేలు ప్రభాకరన్ మొదట సినిమాటోగ్రాఫర్‌గా రాణించాడు. ఆ తర్వాత 1989లో 'నాళైయ మనితన్' చిత్రంతో ఆయన దర్శకుడయ్యారు. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. దాంతో వరుస చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించడం కొనసాగించారు. 1990లో దాని రెండవ భాగాన్ని 'అధిశయ మనితన్' పేరుతో దర్శకత్వం వహించి మళ్ళీ విజయం సాధించారు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా 'అసురన్, రాజకిలి' చిత్రాలకు దర్శకత్వం వహించారు.
నటుడు అరుణ్ పాండియన్‌తో 'కడవూర్', నెపోలియన్ నటించిన 'శివన్', సత్యరాజ్ 'పురతశికరన్' వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆ చిత్రాలు ఒకదాని తర్వాత ఒకటి డిజాస్టర్స్ గా నిలిచాయి. ఇక ఆ తర్వాత ఆయన నటుడిగా మారారు. 'పతినారు, గ్యాంగ్స్ ఆఫ్ మద్రాస్, కడవర్, పిజ్జా 3, రైడ్, వెపన్, కజానా' వంటి అనేక చిత్రాలలో నటించి గుర్తింపు పొందారు. ఆయన చివరిగా తెరపై కనిపించిన చిత్రం 'గజానా'.