మూడు నెలలుగా  జీతాలు పెండింగ్​

మూడు నెలలుగా  జీతాలు పెండింగ్​

మంచిర్యాల, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సంచార పశువైద్య సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. 1962 అంబులెన్స్​లో రోజూ ఊర్లు తిరుగుతూ పశువులకు వైద్యం చేస్తున్నా సకాలంలో శాలరీస్​ అందక ఆర్థికంగా సతమతమవుతున్నారు. రాష్ట్రంలో వంద 1962 అంబులెన్స్ లు జీవీకే ఈఎంఆర్ఐ ఆధ్వర్యంలో పని చేస్తున్నాయి. ఒక్కో వెహికల్​లో వెటర్నరీ డాక్టర్, టెక్నీషియన్, డ్రైవర్, అటెండర్​పని చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 400 మంది వరకు సిబ్బంది ఉన్నారు. ప్రభుత్వం జీవీకే ఈఎంఆర్ఐకి నెలనెలా ఫండ్స్​రిలీజ్​చేస్తే అందులో నుంచి స్టాఫ్​శాలరీస్​, వెహికల్స్​మెయింటెనెన్స్​చార్జీలు చెల్లిస్తారు. అయితే సిబ్బందికి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్​నెలల జీతాలు పెండింగ్​ఉన్నాయి. చాలీచాలని వేతనాలతో పని చేస్తున్నామని, అవీ నెలనెలా ఇయ్యట్లేదని సిబ్బంది పేర్కొంటున్నారు. ఇప్పటికైనా సర్కారు ఫండ్స్​రిలీజ్​చేయాలని కోరుతున్నారు. లేదంటే వచ్చే నెల నుంచి అంబులెన్స్​లు నడిపించే పరిస్థితి ఉండదని సిబ్బంది తెలిపారు.