OTPలు లేదా పాస్‌వర్డ్ లకు గుడ్ బై చెప్పే రోజులు వచ్చాయి. ఇప్పటివరకు మనం వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ ,ఫేస్‌బుక్‌లలోకి లాగిన్ అవ్వాలంటే పాస్ వర్డ్, ఓటీపీ వెరిఫికేషన్ వంటి ప్రాసెస్ ఉంది.. ఇకమీదట ఇవన్నీ ఉండవు.. ఒక్కసారి మీ మొబైల్ నంబర్ వెరిఫికేషన్ చేసుకుంటే చాలు.. లాగిన్ అవడం చాలా సులభం. వొడాఫోన్ ఐడియా, మెటా కలిసి ఓ కొత్త నెట్ వర్క్ ఆధారిత టెక్నాలజీని అందుబాటులో తెచ్చాయి. అదే సైలెంట్ మొబైల్ వెరిఫికేషన్ (SMV) టెక్నాలజీ.. ఫుల్ డెటెయిల్స్ చూద్దాం..
వోడాఫోన్ ఐడియా (Vi) డిజిటల్ భద్రతను మరింత బలోపేతం చేసేందుకు మెటా సంస్థతో చేతులు కలిపింది. సైలెంట్ మొబైల్ వెరిఫికేషన్ (SMV) అనే కొత్త సెక్యూరిటీ టెక్నాలజీని తీసుకొచ్చింది. ఇది ముఖ్యంగా WhatsApp, Instagram, Facebook వంటి మెటా యాప్‌లలో లాగిన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయనుంది.
సాధారణంగా లాగిన్ సమయంలో OTPలు, పాస్‌వర్డ్‌లు వంటి వెరిఫికేషన్ ఉంటుంది. కానీ SMV ద్వారా ఈ ప్రక్రియ పూర్తిగా మారిపోనుంది. కస్టమర్ కేవలం తమ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేస్తే చాలు. తరువాత Vi నెట్‌వర్క్ బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేస్తూ ఆ నంబర్ వినియోగదారుడి సిమ్‌తో సరిపోలుతుందా లేదా అనేది వెరిఫై చేస్తుంది. అన్ని వివరాలు సరైనవైతే యాప్‌లోకి ఆటోమేటిక్‌గా లాగిన్ అవ్వచ్చు. ఎలాంటి సరిపోలిక లేకపోతే యాక్సెస్‌ను వెంటనే బ్లాక్ చేస్తుంది.
ఈ సిస్టమ్ తో SMS ఆధారిత OTPలు, యాప్ అప్డేట్స్ తో పాస్‌వర్డ్‌ల జాగ్రత్త అవసరం తగ్గిపోతుంది. లాగిన్ ప్రక్రియ చాలా సులభంగా, వేగంగా మారుతుంది. ముఖ్యంగా ఫిషింగ్, సిమ్ స్వాపింగ్, సోషల్ ఇంజనీరింగ్ వంటి సైబర్ మోసాలను ప్రారంభ దశలోనే అడ్డుకోవడంలో ఈ సిస్టమ్ బాగా పనిచేస్తుందంటోంది వొడాఫోన్ సంస్థ.
SMV సిస్టమ్ కొత్త యూజర్ రిజిస్ట్రేషన్, మొబైల్ నంబర్ వెరిఫికేషన్, లాగిన్, ఖాతా రికవరీ వంటి ప్రక్రియలను కూడా వేగవంతం చేస్తుంది. Vi ఈ టెక్నాలజీని కేవలం మెటా యాప్‌లకే పరిమితం చేయకుండా భవిష్యత్తులో ఇతర డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకు విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. దీంతో భారతీయ వినియోగదారులకు మరింత సేఫ్టీ, ఈజీ డిజిటల్ సేవలు అందనున్నాయి.
