తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్

భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ తిరుచానూరు  శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. గురువారం (సెప్టెంబర్ 25) అమ్మవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఉపరాష్ట్రపతి దంపతులకు వేద పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చారు. టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. 

భారత ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ వెంట  జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని  సత్యప్రసాద్, దేవదాయ శాఖ  మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తదితరులు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.