
42 ఏళ్ల తన రాజకీయ జీవితంలో.. తొలిసారి ఎన్నికల్లో లేనని భావోద్వేగానికి లోనయ్యారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. హైదరాబాద్ ముచ్చింతల్ లో స్వర్ణభారత్ ట్రస్ట్ నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన వెంకయ్య మాట్లాడుతూ…రైతులు, సేవా కార్యక్రమాలు, యూనివర్సిటీలతోనే ఎక్కువగా గడుపుతున్నానని చెప్పారు.
ఆరోగ్యవంతమైన దేశమే.. శక్తిమంతమైన దేశంగా తయారవుతుందని వెంకయ్య చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ప్రజారోగ్యంపై దృష్టి పెట్టి.. బడ్జెట్ పెంచాలని.. గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు ఉపరాష్ట్రపతి.