లాక్ డౌన్ టైంలో బుక్స్ చదువుతా..పాటలు వింటా

లాక్ డౌన్ టైంలో బుక్స్ చదువుతా..పాటలు వింటా

న్యూఢిల్లీ, వెలుగు:కుటుంబ సభ్యులతో కలిసి టైమ్ గడపడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. లాక్ డౌన్ లో ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయన్నారు. తన రోజువారీ కార్యక్రమాల వివరాలను ఫేస్ బుక్ అకౌంట్ లో  షేర్ చేసుకున్నారు.’పెళ్లైన నాటి నుంచి పట్టుమని 10 రోజులు కూడా ఎప్పుడూ ఇంటి పట్టున లేను. లాక్ డౌన్ వల్ల ఇప్పుడు ఇంట్లోనే ఉండాల్సి వస్తోంది. ఇది కొత్త అనుభవం. మంచి బుక్స్ చదవడం, మంచి ఆలోచనలు పెంచుకోవడం, పంచుకోవడం లాంటి వాటి ద్వారా  ఈ టైమ్ ను సద్వినియోగం చేసుకుంటున్నా. కుటుంబ సభ్యులతో రోజూ మాట్లాడుతున్నా.పెద్ద వాళ్లను పలకరించే అవకాశం దొరికింది’ అని అన్నారు.

తన దిన చర్యను ఇలా వివరించారు…

  • ఉదయం 5 గంటలకు నిద్ర లేవడంతో నా రోజు మొదలవుతుంది.
  • 5.30 నుంచి 6 గంటల వరకు అన్నమాచార్య కీర్తనలను వింటా.
  •  ఒక కప్పు గ్రీన్ టీ తీసుకుంటా.
  • రాత్రి నానబెట్టిన బాదం, ఎండు ద్రాక్ష, మొలకెత్తిన విత్తనాలు తింటా.
  • గంట సేపు న్యూస్ పేపర్స్ చదువుతా. ముఖ్యమైన అంశాలు, ఆర్టికల్స్ ను అండర్ లైన్ చేసి వాటిని ఫైల్ చేయిస్తా.
  • తర్వాత అరగంట సేపు నా భార్య ఉషమ్మతో కలిసి వాకింగ్.
  • 15 నిమిషాలు యోగా.
  • ఉదయం 8 నుంచి కాసేపు ఫ్రెండ్స్ తో  ఫోన్ లో మాట్లాడుతా.
  • 8.-45 కు టిఫిన్.
  • ఉదయం.9.-15 నుంచి 10 గంటల వరకు- మంత్రులు, అధికారులతో ప్రభుత్వ విషయాలు మాట్లాడతా.
  • ముఖ్యమైన వాటిని అవసరమైనప్పుడు ప్రధానికి చెప్తుంటా.
  • 10 గంటల నుంచి రాజ్యసభ, ఉపరాష్ట్రపతి కార్యాలయాల అధికారులతో ఫోన్ లో మాట్లాడతా. అత్యవసరమైన ఫైళ్లు ఉంటే చూస్తా.
  • 11 గంటల నుంచి 12.30 వరకు మిత్రులు, పాత సహచరులను ఫోన్ లో పలకరిస్తా.  ఉషమ్మ మా చుట్టు పక్కల గ్రామాల బంధుమిత్రులను ఫోన్లో పలకరించి క్షేమ సమాచారం తెలుసుకుంటారు.
  • చెన్నైలో ఉన్న అల్లుడు, కూతురు, మనవడు, మనవరాలు, హైదరాబాద్ లో ఉన్న కుమారుడు, కోడలు, మనుమరాళ్లతో మాట్లాడతాం.
  • లంచ్ తర్వాత గంటసేపు రెస్ట్.
  • మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఘంటసాల, సుశీలమ్మ, జానకి, బాలు పాడిన పాతపాటలు వింటా.
  •  మళ్లీ గ్రీన్ టీ తాగి ఆఫీసు విషయాలు ఏవైనా ఉంటే  తెలుసుకుంటా.
  • ఉషమ్మతో కలిసి సాయంత్రం 5 గంటల వరకు ఫ్రెండ్స్ తో ఫోన్ లో మాట్లాడుతాం.
  • వారానికి ఒకరోజు స్వర్ణభారత్ ట్రస్ట్ సేవా కార్యక్రమాల గురించి తెలుసుకుని సూచనలు అందిస్తాం.
  • తర్వాత తోటలో కూరగాయలు, పూలను పరిశీలించి తోటమాలితో మాట్లాడుతాం.
  • తాజా కూరగాయలతో చక్కని తెలుగు వంటకాలు చేయించుకుంటాం.
  • రోజూ కోడిగుడ్లు తప్పనిసరి.
  • సాయంత్రం 6.30కు పాత ఆంజనేయ స్వామి దేవస్థానం ముందు కూర్చుని  భజన పాటలు వింటాం.
  • రాత్రి 7  నుంచి 8 గంటల వరకు ముఖ్యమైన వార్తలు ఉంటే తెలుసుకుంటా.
  • తర్వాత తెలుగు పాటలు వింటా.
  • రాత్రి 8-.30కు డిన్నర్.
  • 9 గంటలకు నిద్ర.
  • ఈ గ్యాప్‌ లో నేను  కలెక్ట్ చేసిన కొన్ని బుక్స్ చదువుతా.
  • మంచి మెసేజ్ లు ఉంటే  ఫ్రెండ్స్ కు పంపిస్తా.
  • అప్పుడప్పుడు ఆర్టికల్స్ రాసి పత్రికలకు పంపిస్తా.
  • కొన్ని విషయాలపై ఎక్స్ పర్ట్స్ తో చర్చిస్తుంటా.ఇలా వెంకయ్య తన దిన చర్యను వివరించారు