అంతా కలిసి మెలిసి ఉండాలన్నదే అలయ్ బలయ్ లక్ష్యం

అంతా కలిసి మెలిసి ఉండాలన్నదే అలయ్ బలయ్ లక్ష్యం

అంతా కలిసి మెలిసి ఉండాలన్నదే అలయ్ బలయ్ లక్ష్యమన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. తెలంగాణా సంస్కృతిని అలయ్ బలయ్ ఎప్పటికప్పుడు గుర్తు చేస్తోందన్నారు. భారతీయ వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. నేచర్.. కల్చర్.. ఫర్ బెటర్ ఫ్యూచర్ అని మరవొద్దన్నారు వెంకయ్యనాయుడు. అందరిపట్ల సేవాభిమానాలు కలిగి ఉండాలన్నారు. దత్తాత్రేయ 16 సంవత్సరాల నుంచి ఈ అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రకృతితో కలిసి జీవించాలి.... ప్రకృతితో కలిసి నడవాలి... అని వెంకయ్యనాయుడు అన్నారు.

రెండు రాష్ట్రాల నేతలు ఒకే వేదికపైకి రావడం సంతోషంగా ఉందన్నారు హర్యాన గవర్నర్ దత్తాత్రేయ. అలయ్ బలయ్ కార్యక్రమంలో భాగంగా దత్తాత్రేయ మాట్లాడారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సమస్య పరిష్కారంలో ఇలాంటి చొరవే చూపాలన్నారు. అందరం ఒకటి అనే భావన తీసుకువచ్చేందుకే అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.