బాలీవుడ్ స్టార్ కపుల్స్లో కత్రినా కైఫ్ మరియు విక్కీ కౌశల్ ఒకరు. ఈ జంట తమ మొదటి బిడ్డకు ఆహ్వానం పలికారు. శుక్రవారం (2025 నవంబర్ 7న) హీరోయిన్ కత్రినా కైఫ్ పండంటి బాబుకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తను కత్రినా భర్త విక్కీ కౌశల్, సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఆనందాన్ని పంచుకున్నారు.
‘‘ఎంతో ఆనందంగా ఉంది. మా ప్రేమకు ప్రతిరూపంగా బాబు జన్మించాడు. మీ అందరి ఆశీర్వాదాలు కావాలి’’ అంటూ విక్కీ కౌశల్ కోరారు. ఈ గుడ్ న్యూస్ విన్న సినీ సెలబ్రెటీలు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో తమ పోస్టులు ద్వారా విషెష్ అందిస్తున్నారు.
2021డిసెంబర్ 9న రాజస్థాన్లో సాంప్రదాయ హిందూ వేడుకలో విక్కీ-కత్రినాల వివాహం జరిగింది. ఈ క్రమంలో పెళ్లయిన నాలుగేళ్లకు కత్రినా తన మొదటిబిడ్డకు జన్మనిచ్చింది. అయితే, గత కొన్ని నెలలుగా కత్రినా కైఫ్ తల్లి కాబోతోంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం వీరి సినిమాల విషయానికి వస్తే.. విక్కీ కౌశల్ ఈ ఏడాది 'ఛావా' మూవీతో వచ్చి బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాశారు. ఇది ఈ 2025 సంవత్సరం అతి పెద్ద హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచి ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం రణబీర్ కపూర్, ఆలియా భట్ లతో కలిసి ' లవ్ & వార్ ' చిత్రంలో నటిస్తున్నారు. మరోవైపు కత్రినా చివరిగా విజయ్ సేతుపతితో కలిసి' మెర్రీ కిస్మస్' లో కనిపించింది.
The pictures we’ve all been waiting for!
— Filmfare (@filmfare) December 9, 2021
Ladies and gentlemen, #KatrinaKaif and #VickyKaushal are officially married. ❤️ pic.twitter.com/4FIfIH8MYV
