
పద్మారావునగర్, వెలుగు: రాజీవ్‌యువ వికాసం పథకంలో భాగంగా క్యాస్ట్, ఇన్‌కం సర్టిఫికెట్ల కోసం అప్లై చేస్తే అనుకున్నట్టు ఇవ్వడానికి సికింద్రాబాద్‌కు చెందిన రెవెన్యూ ఆఫీసర్ఒకరు లంచం తీసుకుంటున్నారని బన్సీలాల్‌పేట కాంగ్రెస్ప్రెసిడెంట్ ఐత చిరంజీవి పలువురు బాధితులతో కలిసి బుధవారం సికింద్రాబాద్ఆర్టీఎ సాయిరామ్ కు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ ఆఫీసర్‌కు రూ. 500, మరో స్టాఫ్‌కు రూ.200 పంపిన గూగుల్‌పే, ఫోన్‌పే స్క్రీన్షాట్లను అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లంచం ఇచ్చిన వారికి రూ.1.90 లక్షలు, ఇవ్వకపోతే రూ.2.20 లక్షల ఆదాయంతో సర్టిఫికెట్లు ఇస్తున్నారన్నారు. ఈ విషయమై తహసీల్దార్ పాండునాయక్ ను వివరణ కోరగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆఫీసర్‌తో మాట్లాడానని ఆ ఫోన్ఇంట్లో ఉంటుందని, ఎవరు డబ్బులు పంపారో తనకు తెలియదని చెప్తున్నారన్నారు. ఎవరో కావాలనే డబ్బులు పంపి తనను ఇరికించే కుట్ర చేస్తున్నారని చెప్పారన్నారు.