342 రన్స్ తేడాతో విక్టరీ.. వన్డేల్లో ఇంగ్లండ్ వరల్డ్ రికార్డ్.. మూడో మ్యాచ్‌‌లో సౌతాఫ్రికా చిత్తు

342 రన్స్ తేడాతో విక్టరీ.. వన్డేల్లో ఇంగ్లండ్ వరల్డ్ రికార్డ్.. మూడో మ్యాచ్‌‌లో సౌతాఫ్రికా చిత్తు

సౌతాంప్టన్‌‌‌‌: జాకబ్‌‌‌‌ బెతెల్‌‌‌‌ (110), జో రూట్‌‌‌‌ (100) సెంచరీలతో దుమ్మురేపడంతో.. ఆదివారం జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్‌‌‌‌ 342 రన్స్‌‌‌‌ తేడాతో సౌతాఫ్రికాపై గెలిచింది. వన్డే క్రికెట్‌‌‌‌ చరిత్రలో రన్స్‌‌‌‌ పరంగా ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. తద్వారా 2023లో ఇండియా 317 రన్స్‌‌‌‌ తేడాతో శ్రీలంకపై గెలిచిన రికార్డును బ్రేక్ చేసింది. 

తొలి రెండు మ్యాచ్‌‌‌‌ల్లో నెగ్గిన సౌతాఫ్రికా 2–1తో సిరీస్‌‌‌‌ను సొంతం చేసుకుంది. టాస్‌‌‌‌ ఓడి బ్యాటింగ్‌‌‌‌కు దిగిన ఇంగ్లండ్‌‌‌‌ 50 ఓవర్లలో 414/5 స్కోరు చేసింది. జెమీ స్మిత్‌‌‌‌ (62), జోస్‌‌‌‌ బట్లర్‌‌‌‌ (62 నాటౌట్‌‌‌‌) రాణించారు. రూట్‌‌‌‌, బెతెల్‌‌‌‌  మూడో వికెట్‌‌‌‌కు 182 రన్స్‌‌‌‌ జోడించారు. డకెట్‌‌‌‌ (31) ఫర్వాలేదనిపించాడు. కార్బిన్‌‌‌‌ బాష్, కేశవ్‌‌‌‌ మహారాజ్‌‌‌‌ చెరో రెండు వికెట్లు తీశారు. 

తర్వాత ఛేజింగ్‌‌‌‌లో సౌతాఫ్రికా 20.5 ఓవర్లలో 72 రన్స్‌‌‌‌కే కుప్ప కూలింది. కార్బిన్‌‌‌‌ బాష్​ (20) టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌. కేశవ్‌‌‌‌ మహారాజ్‌‌‌‌ (17), ట్రిస్టాన్‌‌‌‌ స్టబ్స్‌‌‌‌ (10)తో సహా అందరూ విఫలమయ్యారు. ఇన్నింగ్స్‌‌‌‌లో ఏడుగురు సింగిల్‌‌‌‌ డిజిట్‌‌‌‌కే పరిమితమయ్యారు. ఆర్చర్‌‌‌‌ 4, ఆదిల్ రషీద్‌‌‌‌ 3, బ్రైడన్‌‌‌‌ కార్స్‌‌‌‌ 2 వికెట్లు పడగొట్టారు. ఆర్చర్‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’, కేశవ్‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద సిరీస్‌‌‌‌’ అవార్డులు లభించాయి.