
ఎఫ్ 2, ఎఫ్ 3 లాంటి రెండు హిలేరియస్ ఎంటర్‌టైనర్స్ తర్వాత హీరో వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో మరో సినిమా వస్తోంది. ఆ రెండు చిత్రాలను నిర్మించిన దిల్ రాజు ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. బుధవారం పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను ప్రారంభించారు. ముహూర్తపు షాట్‌కు నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, మరో నిర్మాత సురేష్ బాబు కెమెరా స్విచాన్ చేశారు. దర్శకుడు వంశీ పైడిపల్లి స్క్రిప్ట్‌ని మేకర్స్‌కి అందజేశారు. రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. ఎక్స్ కాప్, అతని ఎక్స్‌లెంట్ వైఫ్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ చుట్టూ తిరిగే ఈ ట్రయాంగిల్ క్రైమ్ ఎంటర్‌టైనర్‌లో.. వైఫ్‌గా ఐశ్వర్య రాజేష్, గర్ల్ ఫ్రెండ్‌గా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, వీటీ గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్, ఆనంద్ రాజ్, చైతన్య జొన్నలగడ్డ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.