ఆ యాప్స్ యూజర్ డేటాను కలెక్ట్ చేస్తున్నాయా?

ఆ యాప్స్ యూజర్ డేటాను కలెక్ట్ చేస్తున్నాయా?

న్యూఢిల్లీ: కరోనా లాక్ డౌన్ తో వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ ల వినియోగం గణనీయంగా పెరిగింది. సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నప్పటికీ, సరైన ప్రత్యామ్నాయం లేకపోవడంతో జూమ్ లాంటి యాప్స్ ను యూజర్లు విపరీతంగా ఉపయోగిస్తున్నారు. అయితే వీడియో కాలింగ్ కోసం ఉపయోగిస్తున్న వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్స్ యూజర్ డేటాను కలెక్ట్ చేస్తున్నాయని కన్సూమర్ రిపోర్ట్స్ వెల్లడించింది. కొత్తగా వచ్చిన గూగుల్ మీట్, మైక్రోస్టాఫ్ట్ టీమ్స్, సిస్కో రూపొందించిన వెబెక్స్ కూడా సాధ్యమైనంత యూజర్ డేటాను కలెక్ట్ చేశాయని ఈ రిపోర్ట్ పేర్కొంది. వీడియో కాల్ లో పాల్గొన్న పార్టిసిపెంట్స్, వారి ఐపీ అడ్రస్ లు, మీటింగ్ డ్యురేషన్ టైమ్ లాంటి డేటాను ఈ కంపెనీలు సేకరించాయని ఈ నివేదిక చెబుతోంది. ఇలా సేకరించిన డేటాను కన్సూమర్ ప్రొఫైల్స్ రూపొందించడంతోపాటు ఫేషియల్ రికాగ్నిషన్ స్టిస్టమస్ కోసం వినియోగిస్తారని నివేదిక చెప్తోంది. ఈ రిపోర్ట్స్ పై వీడియో కాన్ఫరెన్సింగ్ కంపెనీలు స్పందించాయి. ప్రైవసీ అనేది మనుషుల హక్కు అని పేర్కొన్నాయి. అలాంటి హక్కును తాము అమ్మడం గానీ కిరాయికి ఇవ్వడం గానీ చేయబోమని స్పష్టం చేశాయి. వీడియో కాలింగ్ టైమ్ లో యూజర్ రికార్డ్ బటన్ ను ప్రెస్ చేస్తేనే ఆడియో, వీడియోను రికార్డు చేస్తామని, అలా రికార్డ్ చేసిన వాటిని అడ్వర్టైజింగ్ కోసం వాడబోమని వివరించాయి.