
శ్రీలంక తో రెండో టెస్టులో ఓటమి తర్వాత బంగ్లాదేశ్ టెస్ట్ కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో తన సారధ్య బాధ్యతలకు రాజీనామా చేశాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు శనివారం (జూన్ 28) అధికారికంగా ప్రకటించాడు. టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలనే తన నిర్ణయాన్ని "కొన్ని రోజుల క్రితమే" బీసీబీ క్రికెట్ ఆపరేషన్స్ విభాగానికి తెలియజేసినట్లు నజ్ముల్ హుస్సేన్ శాంటో తెలిపారు. ఇటీవలే శాంటోను వన్డే కెప్టెన్ నుంచి తొలగించి అతని స్థానంలో మెహిదీ హసన్ మిరాజ్‌ను నియమించారు. టెస్ట్ కెప్టెన్ కు కూడా గుడ్ బై చెప్పడంతో మెహిదీ హసన్ మిరాజ్ కు టెస్ట్ నాయకత్వ బాధ్యతలను అప్పజెప్పే అవకాశం ఉంది.
"టెస్ట్ ఫార్మాట్‌లో నేను ఇకపై కెప్టెన్‌గా కొనసాగాలనుకోవడం లేదు. జట్టు శ్రేయస్సు కోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. మూడు ఫార్మాట్లకు ముగ్గురు వేర్వేరు కెప్టెన్లు ఉండటం 'సమంజసమైనది కాదు. నా నిర్ణయం జట్టుకు సహాయపడుతుందని నేను భావిస్తున్నాను. గత కొన్ని సంవత్సరాలుగా నేను డ్రెస్సింగ్ రూమ్‌లో భాగమయ్యాను. ఇది నా వ్యక్తిగత నిర్ణయం. ముగ్గురు వేర్వేరు కెప్టెన్లు జట్టులో ఉండడం కష్టమని నేను భావిస్తున్నాను".అని లంక చేతిలో ఓటమి తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో శాంటో అన్నాడు.
►ALSO READ | SA vs ZIM: జింబాబ్వేతో ప్రారంభమైన టెస్ట్: సౌతాఫ్రికా జట్టులో ముగ్గురు కొత్త ప్లేయర్లు.. ఏడు మార్పులు
శాంటో రెండో టెస్టులో విఫలమైనా.. తొలి టెస్టులో అదరగొట్టాడు. రెండు ఇన్నింగ్స్ ల్లో సెంచరీలు చేసి చరిత్ర సృష్టించాడు. ఇకపై శాంటో ప్లేయర్ గా మాత్రమే జట్టులో కొనసాగనున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే కొలంబో వేదికగా సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ లో శ్రీలంకపై బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 78 పరుగుల తేడాతో ఓడిపోయింది. 6 వికెట్ల నష్టానికి 115 పరుగులతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన బంగ్లాదేశ్ మరో 18 పరుగులు జోడించి చివరి నాలుగు వికెట్లను కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 247 పరుగులు చేసింది. అనంతరంశ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్ లో 458 పరుగుల భారీ స్కోర్ చేసి 211 పరుగుల లీడ్ సంపాదించింది. రెండో ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 133 పరుగులకు ఆలౌటైంది.
JUST IN: Najmul Hossain Shanto quits as Bangladesh's Test captain following the series against Sri Lanka #SLvBAN pic.twitter.com/TkZhQh3fWk
— ESPNcricinfo (@ESPNcricinfo) June 28, 2025