SA vs ZIM: జింబాబ్వే‌తో ప్రారంభమైన టెస్ట్: సౌతాఫ్రికా జట్టులో ముగ్గురు కొత్త ప్లేయర్లు.. ఏడు మార్పులు

SA vs ZIM: జింబాబ్వే‌తో ప్రారంభమైన టెస్ట్: సౌతాఫ్రికా జట్టులో ముగ్గురు కొత్త ప్లేయర్లు.. ఏడు మార్పులు

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ గెలిచిన తర్వాత సౌతాఫ్రికా తొలి టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది. జింబాబ్వేతో రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా శనివారం (జూన్ 28) తొలి టెస్ట్ ప్రారంభమైంది. బులవాయో వేదికగా క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. జింబాబ్వేతో జరగబోయే రెండు టెస్టులు కూడా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ షిప్ లో భాగం కాదు. దీంతో ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా ప్రయోగాలు చేసింది. భారీ మార్పులతో బరిలోకి దిగింది. 

ఆస్ట్రేలియాపై టెస్ట్ ఛాంపియన్ షిప్ గెలిచిన జట్టులో ఏకంగా 7 గురు ప్లేయింగ్ 11 లో లేకపోవడం విశేషం. వియాన్ ముల్డర్, డేవిడ్ బెడింగ్‌హామ్, కైల్  వెర్రెయిన్నే, కేశవ్ మహారాజ్ మాత్రమే ప్రస్తుతం జింబాబ్వేతో టెస్ట్ ఆడుతున్నారు. మిగిలిన ఆటగాళ్లకు రెస్ట్ ఇచ్చారు. రెగ్యులర్ కెప్టెన్ బవుమా దూరం కావడంతో స్పిన్నర్ కేశవ్ మహరాజ్ సౌతాఫ్రికాకు తొలిసారి టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు చేపడుతున్నాడు. రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కోసం ప్రోటీస్ జట్టు ఏకంగా ఐదుగురు అన్‌క్యాప్డ్ ఆటగాళ్లను ఎంపిక చేయడం విశేషం. బ్యాటర్లు లెసోగో సెనోక్వానే, లువాన్-డ్రే ప్రిటోరియస్, మాథ్యూ బ్రీట్జ్కే, డెవాల్డ్ బ్రెవిస్, ప్రెనెలాన్ సుబ్రాయెన్‌లను జట్టులోకి తీసుకున్నారు. 

►ALSO READ | ENG vs IND 2025: రెండో టెస్టులో టీమిండియాకు బిగ్ ఛాలెంజ్.. బుమ్రాతో పాటు మరో ఫాస్ట్ బౌలర్ ఔట్!

లువాన్-డ్రే ప్రిటోరియస్, మాథ్యూ బ్రీట్జ్కే, డెవాల్డ్ బ్రెవిస్ కు తుది జట్టులో స్థానం దక్కింది. వీరు ముగ్గురు తమ తొలి టెస్ట్ ఆడుతున్నారు. లుంగీ ఎంగిడి రెండో టెస్టుకు అందుబాటులో ఉంటాడు. ఈ టెస్ట్ జూలై 6 నుంచి 10 వరకు బుల్వాయోలో జరుగుతుంది. మార్కో జాన్సెన్,  కగిసో రబాడలతో పాటు ఐడెన్ మార్క్రామ్, ర్యాన్ రికిల్టన్, ట్రిస్టన్ స్టబ్స్‌లకు విశ్రాంతి ఇచ్చారు. బవుమా గాయం కారణంగా రెస్ట్ తీసుకున్నాడు. 

జింబాబ్వేతో తొలి టెస్టుకు సౌతాఫ్రికా ప్లేయింగ్ 11:

టోనీ డి జోర్జి, మాథ్యూ బ్రీట్జ్కే, వియాన్ ముల్డర్, డేవిడ్ బెడింగ్‌హామ్, లువాన్-డ్రే ప్రిటోరియస్, డెవాల్డ్ బ్రెవిస్, కైల్ వెర్రెయిన్నే(వికెట్ కీపర్), కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్(కెప్టెన్), కోడి యూసుఫ్, క్వేనా మఫాకా