
టీ20 ఫార్మాట్ లో ఐసీసీ పవర్ ప్లే లో కొత్త రూల్స్ తీసుకొని వచ్చింది. వర్షం లేకపోతే మరేదైనా కారణాల వలన 20 ఓవరాల్ మ్యాచ్ ను కుదిస్తారు. ఆ సమయంలో పవరే ప్లే విషయంలో గందరగోళం ఏర్పడుతుంది. ఇలా జరిగిన ప్రతిసారి ఐసీసీ అప్పటికప్పుడు కుదించిన ఓవర్లను బట్టి పవర్ ప్లే ఎన్ని ఓవర్లో నిర్ణయిస్తుంది. అయితే శుక్రవారం ఐసీసీ (జూన్ 27) పవర్‌ప్లే ఓవర్లపై స్పష్టతనిచ్చింది. మ్యాచ్ కుదిస్తే ఎన్ని ఓవర్లకు పవర్ ప్లే ఎన్ని ఓవర్లు చొప్పున లెక్కిస్తారో చెప్పింది. దీని ప్రకారం కనీసం 5 ఓవర్లు మ్యాచ్ జరిగితే పవర్ ప్లే 1.3 ఓవర్లు ఉంటుంది. అంటే 5 ఓవర్లకు 9 బంతులు పవర్ ప్లే ఉంటుంది.
పవర్ ప్లే రూల్స్ ప్రకారం 30 గజాల సర్కిల్ లోపల ఇద్దరు ఫీల్డర్లు మాత్రమే ఉండాలి. సాధారణంగా 20 ఓవర్ల టీ20 ఫార్మాట్ లో తొలి 6 ఓవర్లు పవర్ ప్లే ఉంటుంది. అయితే ఇప్పుడు కనీసం 5 ఓవర్ల తర్వాత పవర్ ప్లే ఎన్ని ఓవర్లు ఉంటుందో లెక్కకు లెక్క ఉంది. ఈ మార్పుల వల్ల మ్యాచ్ నిడివి ఎంత ఉన్నా, ఫీల్డింగ్ పరిమితుల విషయంలో అన్ని జట్లకు సమాన అవకాశాలు లభిస్తాయని ఐసీసీ భావిస్తోంది. ఈ కొత్త పవర్‌ప్లే నిబంధనలు జూలై నుంచి అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లకు వర్తిస్తాయని ఐసీసీ స్పష్టం చేసింది.
కొత్త నిబంధనల ప్రకారం వివిధ ఓవర్ల మ్యాచ్‌లకు పవర్‌ప్లే ఇలా..
5 ఓవర్ల ఇన్నింగ్స్‌కు, 1.3 ఓవర్లు పవర్‌ప్లే
6 ఓవర్ల ఇన్నింగ్స్‌కు 1.5 ఓవర్లు పవర్‌ప్లే
7 ఓవర్ల ఇన్నింగ్స్‌కు 2.1 ఓవర్లు పవర్‌ప్లే
8 ఓవర్ల ఇన్నింగ్స్‌కు 2.2 ఓవర్లు పవర్‌ప్లే
9 ఓవర్ల ఇన్నింగ్స్‌కు 2.4 ఓవర్లు పవర్‌ప్లే
10 ఓవర్ల ఇన్నింగ్స్‌కు 3 పవర్‌ప్లే ఓవర్లు
11 ఓవర్ల ఇన్నింగ్స్‌కు 3.2 ఓవర్లు పవర్‌ప్లే
12 ఓవర్ల ఇన్నింగ్స్‌కు 3.4 ఓవర్లు పవర్‌ప్లే
13 ఓవర్ల ఇన్నింగ్స్‌కు 3.5 ఓవర్ల పవర్‌ప్లే
14 ఓవర్ల ఇన్నింగ్స్‌కు 4.1 ఓవర్ల పవర్‌ప్లే
15 ఓవర్ల ఇన్నింగ్స్‌కు 4.3 ఓవర్ల పవర్‌ప్లే
16 ఓవర్ల ఇన్నింగ్స్‌కు 4.5 ఓవర్ల పవర్‌ప్లే
17 ఓవర్ల ఇన్నింగ్స్‌కు 5.1 ఓవర్ల పవర్‌ప్లే
18 ఓవర్ల ఇన్నింగ్స్‌కు 5.2 ఓవర్ల పవర్‌ప్లే
19 ఓవర్ల ఇన్నింగ్స్‌కు 5.4 ఓవర్ల పవర్‌ప్లే