
మధ్యప్రదేశ్ లో ఘోరం జరిగింది. ఓ వ్యక్తి మరో వ్యక్తిపై మూత్రం పోస్తున్న వీడియో వైరల్ అవుతోంది. నిస్సహాయ స్థితిలో ఉన్న వ్యక్తిపై ఇలా మూత్ర విసర్జన చేయడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సిగరెట్ తాగుతూ యూరిన్ పోసిన వ్యక్తి ఓ రాజకీయ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అనుచరుడని.. బాధితుడు ట్రైబల్ వ్యక్తి అని ట్వీట్స్ చేస్తున్నారు. ఇది అమానవీయ చర్య అని నిందితుడిని శిక్షించాలంటై డిమాండ్ చేస్తున్నారు.
మధ్యప్రదేశ్ లో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓవ్యక్తి... ట్రైబల్ కూలీపై మూత్రం పోసిన వీడియో వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సిగరెట్ తాగుతూ నిస్సహాయ స్థితిలో ఉన్న వ్యక్తిపై ఇలాచేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. అయితే నిందితుడు ఓ రాజకీయ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అనుచరుడని.. బాధితుడు ట్రైబల్ వ్యక్తి అని ట్వీట్స్ చేస్తున్నారు.
ఈ వీడియోపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. నిందితుడిపై జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ) కింద కేసునమోదు చేస్తామని చెప్పారు. బాధితుడు సిద్ది గ్రామంలో నివసిస్తూ కూలి పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.
ఈ వీడియోపై మధ్యప్రదేశ్ ప్రతిపక్ష నేతలు కూడా తీవ్రంగా విమర్శించారు. ఆధునిక సమాజంలో ఇలాంటి నీచమైన చర్యకు తావు లేదని మాజీ సీఎం కమల్‌నాథ్ అన్నారు. మధ్యప్రదేశ్‌లో గిరిజనులపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టాలని ఆయన అన్నారు. మధ్యప్రదేశ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, గిరిజన నాయకుడు విక్రాంత్ భూరియా ఈ ఘటన సిగ్గుచేటంటూ నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ నీచమైన ఘటనకు పాల్పడిన వ్యక్తిని ప్రవేశ్ శుక్లాగా గుర్తించారు. శుక్లాపై సిద్ధి పోలీసులు IPC 294 , 504 సెక్షన్లతో SC/ST చట్టం కింద కేసు నమోదు నమోదు చేశారు.