దాడి వీడియో: PoKలో భారత్ రివేంజ్ ఫైర్

దాడి వీడియో: PoKలో భారత్ రివేంజ్ ఫైర్

పుల్వామా దాడికి ప్రతీకారంగా PoKలో భారత్ వైమానిక దళం రివేంజ్ ఫైర్ చేసింది. ఈ ఘటనతో ఉగ్ర స్థావరాలన్ని నాశనం అయ్యాయి. ఫైటర్ జెట్స్ బాంబుల దాడి  చేస్తుండగా స్థానిక యువత సెల్ ఫోన్ లో బంధించారు. ఇప్పుడు ఆ వీడియో బయటకు వచ్చింది… ఆ వీడియోలో..  పాక్ ఫైటర్ జెట్స్ భారత విమానాలను తమిరినట్టు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్ ఆర్మీ అధికారి మాత్రం… పాక్ వైమానిక దళాలు స్పందించేలోపు భారత విమానాలు దాడులు చేసి వెనక్కి వెళ్లాయని చెప్పారు. భారత ఫైటర్ జెట్స్  దాడి చేసిన వీడియో మాత్రం హల్ చల్ చేస్తుంది. ఈ వీడియోలో ఉగ్ర స్థావరాలపై  ఎలా దాడి చేశారన్నది చూడవచ్చు.