రష్యా విడుదల చేసిన కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ పై అనేక అనుమానాలు తలెత్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ అనుమానాల్ని నివృత్తి చేస్తూ స్పుత్నిక్ వీపై ప్రపంచానికి నమ్మకాన్ని కలిగించేందుకు రష్యా ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో గమేలియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మైక్రో బయాలజీ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ వైరస్ ను ఏ విధంగా చంపేస్తుందో ఓ వీడియాను గమేలియా డైరక్టర్ అలెగ్జాండర్ జింట్స్ విడుదల చేశారు. ఆ వీడియోలో 1957లో రష్యా లాంచ్ చేసిన ప్రపంచ తొలి కృతిమ భూమి ఉపగ్రహం స్పుత్నిక్ – 1 నుంచి ప్రతిబింబించేలా స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ఉంటుందనేలా.. 38 సెకన్ల నిడివి ఉన్న సీజీఐ వీడియోలో భూమి ఉపగ్రహం స్పుత్నిక్ – 1 నుంచి ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఉన్న కోవిడ్‌ను నాశనం చేయవచ్చని అందులో చూపించారు. ఈ సందర్భంగా అలెగ్జాండర్ మాట్లాడుతూ మరో వారం పది రోజుల్లో స్పుత్నిక్ వీ మూడో దశ మనుషులపై ప్రయోగిస్తున్నామని..ఇందుకోసం భారీ ఎత్తున వాలంటీర్లు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.
