కింగ్‌ కోబ్రాకే తలస్నానం చేపిచ్చిండు

కింగ్‌ కోబ్రాకే తలస్నానం చేపిచ్చిండు
  • సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌
  •  ఎంజాయ్‌ చేసిన కోబ్రా

హైదరాబాద్‌: సాధారణంగా చిన్న పాము కనిపిస్తేనే భయంతో పరుగులు పెడతాం. పాము బుస కొట్టినట్లు శబ్దం వినిపించినా భయంతో వణికిపోతాం. అలాంటిది ఒక కింగ్‌ కోబ్రా మన ముందు వచ్చి నిలబడితే ఇంకేమైనా ఉందా.. పై ప్రాణాలు పైకే పోతాయి. అలాంటిది ఒక వ్యక్తి 14 అడుగుల కింగ్‌ కోబ్రాకు స్నానం చేయించాడు. ఏంటీ నమ్మకం కలగడం లేదా.. అవును మీరు చదివింది కరెక్టే ఆ వ్యక్తి కింగ్‌ కోబ్రాకు స్నానం చేయించిన వీడియో సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసెస్‌ ఆఫీసర్‌‌ సుశాంత్‌ నందా ట్విటర్‌‌‌‌లో దాన్ని పోస్ట్‌ చేశారు. ఒక వ్యక్తి కింగ్‌ కోబ్రాకు దగ్గర్లోని కుళాయిలో నీటిని పట్టుకుని స్నానం చేయించాడు. అయితే ఆ పాము కిక్కురు మనకుండా హాయిగా స్నానాన్ని ఎంజాయ్ చేసింది. ఆ వ్యక్తి కోబ్రా తలపై నిమురుతున్నా అది ఏమీ అనలేదు. “ సమ్మర్‌‌‌‌లో ఎవరు తలస్నానం వద్దంటారు. ఇది చాలా డేంజర్‌‌ ఎవరూ ట్రై చేయొద్దు” అని నందా‌ ట్వీట్‌ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు. కొంత మంది ఆ వ్యక్తి సాహసాన్ని మెచ్చుకుంటే.. మరి కొంత మంది పామును చూస్తే కిలోమీటర్‌‌ దూరం పరిగెత్తుతానంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా.. ఎండలో బాగా తిరిగి అలిసిపోయిన కింగ్‌కోబ్రా చక్కగా స్నానం చేయించుకుంటుంది అని మరికొందరు కామెంట్లు పెట్టారు.