విద్రోహి మూవీ ట్రైలర్ రిలీజ్.. ‎ఆసక్తిరేపుతోన్న సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌‎‌‌‌‌

విద్రోహి మూవీ ట్రైలర్ రిలీజ్.. ‎ఆసక్తిరేపుతోన్న సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌‎‌‌‌‌

‎రవి ప్రకాష్, శివకుమార్, చరిష్మా శ్రీఖర్, సాయికి లీడ్ రోల్స్‌‎‌లో రూపొందుతున్న చిత్రం ‘విద్రోహి’. ఈ క్రైమ్ థ్రిల్లర్‌కు విఎస్‌వి దర్శకత్వం వహిస్తున్నాడు. వెంకట సుబ్రహ్మణ్యం విజ్జన నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌‎ను హీరో అల్లరి నరేష్ లాంచ్ చేశారు. అనంతరం నరేష్ మాట్లాడుతూ.. ‘ట్రైలర్ చాలా బాగుంది. ఈ సినిమాకు వర్క్ చేసిన వాళ్లంతా నా క్లోజ్ పర్సన్స్‌‌. సినిమా సక్సెస్‌‌‌ కావాలని కోరుకుంటున్నా. టీమ్ అందరికీ బెస్ట్ విషెస్‌’ అని చెప్పారు. 

దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఇప్పటి వరకు రాని సరికొత్త పాయింట్‌‎తో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌‎‌‌‌‌గా తెరకెక్కించాం. ఇందులోని ప్రతి పాత్ర ఆకట్టుకునేలా ఉంటుంది’ అని అన్నారు. శ్రీకాంత్, వినాయక్, ఆర్పీ పట్నాయక్‌‎లు విడుదల చేసిన ఫస్ట్ లుక్, రెండు పాటలకు మంచి రెస్పాన్స్‌‌‌‌వచ్చిందని, త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌‎ను అనౌన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తామని నిర్మాత తెలియజేశారు.