ఇందిరాగాంధీ పాత్రలో విద్యాబాలన్

ఇందిరాగాంధీ పాత్రలో విద్యాబాలన్

ఆచితూచి పాత్రల్ని ఎంచుకోవడం, ఎంచుకున్న ప్రతి పాత్రకీ ప్రాణం పోయడం విద్యాబాలన్ ప్రత్యేకత. మామూలు పాత్రలనే అదరగొట్టేసే ఆమెకి.. పవర్‌ ఫుల్ పొలిటీషియన్ పాత్ర దొరికితే ఎలా ఉంటుం ది! దాన్ని పోషించడానికి ఆమె ఎంత ఉత్సాహపడుతుందో తెలీదు కానీ, చూడటానికి మాత్రం ప్రేక్షకులు చాలా ఆసక్తి చూపిస్తారు. ఇప్పుడిదంతా ఎందుకు అంటే, భారతదేశ రాజకీయ చరిత్రలో తిరుగులేని నేతగా నిలిచి పోయిన ఇందిరాగాంధీ పాత్రలో విద్య కనిపించనుంది. అయితే సినిమాలో కాదు, వెబ్ సిరీస్‌లో. దీని గురించి గతంలో కూడా వార్తలొచ్చాయి కానీ అఫీషియల్ గా ఎవరూ ప్రకటించలేదు. దాంతో నిజంగా చేస్తోందా లేదా అనే సందేహాలున్నా యి. కానీ రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో

విద్య దీని గురించి మాట్లాడటంతో క్లారిటీ వచ్చేసింది. ‘రెండేళ్ల క్రితం ఇందిరాగాంధీ జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకాన్ని కొన్నాను . అయితే అప్పటికి వెబ్ సిరీస్​ చేసే ఆలోచన లేదు. కానీ పుస్తకం చదివాక ఇందిరమ్మ జీవితం మొత్తాన్నీ కవర్​ చెయ్యాలంటే వెబ్ సిరీస్​ కరెక్ట్ అనిపించింది’ అని చెప్పింది విద్య. ఆమే స్వయంగా దీన్నినిర్మించనుంది. కాకపోతే సినిమాల్లో నటిస్తూ వెబ్ సిరీస్‌కి టైమ్ కేటాయించడం కష్టం కనుక కాస్త వీలు చూసుకుని మొదలుపెడుతుందట. ఎప్పుడు చేసేది క్లియర్‌ గా చెప్పలేనని, ఓ రెండు మూడేళ్లలో తీసేందుకు ప్రయత్నిస్తానని అంటోంది. అసలే ఇప్పుడు బయోపిక్స్‌ జోరు మీదున్నాయి. విద్య లేట్‌ చేస్తే ఎవరైనా తీసినా తీసేయొచ్చు. ఆ విషయం ఆమె ఆలోచించిందో లేదో!