హైదరాబాద్, వెలుగు: డా. విద్యా స్రవంతి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం గాంధీ భవన్ లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకున్నా రు. ఈ సందర్భంగా దీపాదాస్ మున్షి మాట్లాడుతూ..రాష్ట్రంలో కాంగ్రెస్ రోజురోజుకు బలపడుతున్నదని తెలిపారు.కాంగ్రెస్ సిద్ధాంతాలు నచ్చినవారు పార్టీలో చేరాలన్నారు.
విద్యాస్రవంతి లాంటి విద్యావేత్తలు, మేధావులు పార్టీలోకి రావడం హర్షణీయమన్నారు. కాంగ్రెస్లో చేరే వారికి తగిన ప్రాధాన్యమిస్తామని దీపాదాస్ మున్షి పేర్కొన్నారు. గాంధీ సిద్ధాంతాలున్న కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందని విద్యా స్రవంతి అన్నారు. సోనియా గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కల నేతృత్వంలో పార్టీ కోసం పనిచేస్తానని చెప్పారు.
