ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన

ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన

పద్మారావునగర్, వెలుగు: శ్రీనివాసనగర్‌‌లోని శ్రీగిరి ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణానికి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్​గెస్టుగా పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర భారతి స్వామి, మంత్రులు ఇంద్రకరణ్​రెడ్డి, తలసాని శ్రీనివాస్​ యాదవ్ ​పాల్గొన్నారు. 
ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ..భక్తి భావాన్నిపెంపొందించేందుకు, సన్మార్గంలో నడిపించేందుకు మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. కంచి పరమాచార్య చంద్రశేఖర సరస్వతి స్వామి ప్రతిష్టించిన ఆలయాల్లో ఇది ఒకటన్నారు. ఇలాంటి ఆలయ పునర్నిర్మాణం తన చేతుల మీదుగా జరగడం భగవంతుని సంకల్పం అన్నారు. పుష్పగిరి పీఠం తరఫున ఆలయ అభివృద్ధికి విరాళం ఇచ్చారు. మంత్రులు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని జీర్ణ దేవాలయాలను పునరుద్ధరిస్తున్నామని చెప్పారు. రెండేళ్లలో నిర్మాణ పనులు పూర్తిచేస్తామని ఈవో రాజేశ్​కుమార్, కమిటీ చైర్మన్‌‌ బసవరాజు వివరించారు. స్థానిక కార్పొరేటర్‌‌ సామల హేమ, ఆధ్యాత్మిక వేత్తలు పాల్గొన్నారు.