30 వేల మంది ఫ్యాన్స్‌‌‌‌ మధ్య కిక్​

30 వేల మంది ఫ్యాన్స్‌‌‌‌ మధ్య కిక్​

న్యూఢిల్లీ: కరోనా భయం లేదు.. సోషల్‌‌‌‌డిస్టెన్సింగ్‌‌‌‌రూల్స్‌‌‌‌లేవు.. ఒకరిద్దరు కాదు.. దాదాపు 30,000 మంది ఫ్యాన్స్‌‌‌‌స్టేడియంకు పోటెత్తారు. తమ ఫేవరెట్‌‌‌‌స్టార్లు  ఫుట్‌‌‌‌బాల్‌‌‌‌ఆడుతుంటే ఫుల్‌‌‌‌గా ఎంజాయ్‌‌‌‌చేశారు. ఏంటి ఇదంతా నిజమేనా అనే డౌట్‌‌‌‌వద్దు.  తమ దేశంలో కరోనా భయం లేకపోవడంతో వియత్నాం  ప్రొఫెషనల్‌‌‌‌లీగ్‌‌‌‌ను శుక్రవారం నుంచి మొదలుపెట్టారు. నిజానికి ‘వీ’ లీగ్‌‌‌‌మార్చిలోనే జరగాల్సి ఉండగా కరోనా భయంతో వాయిదా వేశారు. వియత్నాంలో ఇప్పటిదాకా 328 పాజిటివ్‌‌‌‌కేసులే  తేలడం,  పైగా ఒక్కరు కూడా వైరస్‌‌‌‌వల్ల చనిపోకపోవడంతో లీగ్‌‌‌‌ను స్టార్ట్‌‌‌‌చేశారు.

అంతేకాకుండా స్టేడియంలోకి ఫ్యాన్స్‌‌‌‌కు కూడా అనుమతిచ్చారు. మ్యాచ్‌‌‌‌జరిగిన స్టేడియం కెపాసిటీ 30 వేలు కాగా దాదాపు స్టాండ్స్‌‌‌‌అన్నీ నిండిపోయాయి. ముందుజాగ్రత్తగా స్టేడియంలోకి వచ్చే ఫ్యాన్స్‌‌‌‌కు టెంపరేచర్‌‌‌‌చెకప్‌‌‌‌చేశారు. హ్యాండ్ ‌‌‌‌శానిటైజర్స్‌ ‌‌‌అందుబాటులో ఉంచారు. స్టాండ్స్‌‌‌‌లో ఉన్నవాళ్లలో చాలా తక్కువ మంది మాస్క్‌‌‌‌లు ధరించారు. ఇక,  లీగ్‌‌‌‌తొలి మ్యాచ్‌‌‌‌లో విటెల్‌‌‌‌2–1తో నిమ్‌‌‌‌దిన్‌‌‌‌జట్టుపై గెలిచింది. కరోనా వైరస్‌‌‌‌టెస్ట్‌‌‌‌లతో పాటు క్వారంటైన్‌‌‌‌ప్రోగ్రామ్‌‌‌‌విషయంలో వియత్నాం ప్రపంచ దేశాల నుంచి ప్రశంసలు అందుకుంది. ఆ చర్యల వల్లే ఎకానమీ గాడిలో పెట్టుకునే  పనిలో అందరికంటే ఓ అడుగు ముందు ఉంది.

మరిన్ని వార్తల కోసం

నెట్టింట్లో వైరల్ అవుతున్న సన్న పిన్ చార్జర్