రష్యా కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ పై వలర్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తో పాటు పలుదేశాలకు చెందిన సైంటిస్ట్ లు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
రష్యా విడుదల చేసిన కరోనా వ్యాక్సిన్ ను పూర్తి స్థాయిలో ట్రయల్స్ నిర్వహించలేదని, దీనివల్ల భారీ ఎత్తున నష్టాల్ని చవిచూడాల్సి వస్తుందని సైంటిస్ట్ లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఓ వైపు దేశాల్ని కరోనా పట్టిపీడిస్తున్నా…రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ ను కొనుగోలు చేసేందుకు ఎవరూ సాహసం చేయడం లేదు.
అయితే తాజాగా వియాత్నం దేశం రష్యా విడుదల చేసిన స్పుత్నిక్ ను భారీ ఎత్తున కొనుగులు చేసినట్లు, అందుకు సంబంధించిన ఒప్పొందాలు పూర్తయ్యాయని తెలుస్తోంది. త్వరలో రష్యా నుంచి వియాత్నానికి వ్యాక్సిన్ రావాల్సి ఉందని అక్కడి మీడియా సంస్థలు కథనాల్ని ప్రసారం చేస్తున్నాయి. అంతేకాదు రష్యాతో వ్యాక్సిన్ పై ఒప్పొందం కుదిరిందని రిజిస్ట్రేషన్ పనులు పూర్తయ్యాయని కథనాల్లో పేర్కొన్నాయి.
తాము కూడా కరోనా వ్యాక్సిన్ ను తయారు చేస్తున్నామని వియాత్నం ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఆ ప్రకటను ఊటంకించిన మీడియా సంస్థ వియాత్నాం టెలివిజన్ ఓ ప్రకటన విడుదల చేసింది.
వియత్నాంలో 911 కరోనా కేసులు నమోదయ్యాయి. వాటిలో 21మంది బాధితులు మరణించగా…వైరస్ నుంచి దేశాన్ని కాపాడేందుకు వియాత్నాం రష్యాతో స్పుత్నిక్ పై ఒప్పొందం కుదుర్చుకుందని తెలిపింది.
మరో మీడియా సంస్థ తుయోయ్ ట్రె మీడియా సంస్థ ..వియాత్నం ప్రభుత్వం రష్యాతో 50 నుంచి 150మిలియన్ల కరోనా వ్యాక్సిన్ టీకా స్పుత్నిక్ ను అందించేలా ఒప్పొందం కుదర్చుకుందని ప్రచారం చేసింది.
రష్యానుంచి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది..? ఎంత ఖర్చవుతోందో తెలియదని మంత్రిత్వశాఖ తెలిపింది. కానీ గత నెలలో 2021నాటి ప్రతీ ఇంటికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని వియాత్నం మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
