
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి తీహార్ జైల్లో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు వరుస షాక్ లు తగులుతున్నాయి. ఆయన వ్యక్తిగత కార్యదర్శి వైభవ్ కుమార్‌ను తాజాగా విధుల నుంచి తొలగించారు. అతడి నియామక ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ విజిలెన్స్ వెల్లడించింది. ఈ తొలగింపు తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేశాడని వైభవ్ కుమార్‌పై 2007లో నోయిడా పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపింది. అయితే, కేజ్రీవాల్‌కు పీఎస్‌గా నియమించే సమయంలో ఈ కేసు వివరాలను వెల్లడించలేదని విజిలెన్స్ విభాగం దర్యాప్తులో తేలింది. దీంతో ఆయనను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.