హైదరాబాద్, వెలుగు: విజ్ఞాన్ యూనివర్సిటీ మరో మైలురాయిని అందుకుంది. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్‌బీఏ) తనీఖీ బృందం 2025 ఆగస్టు 29 నుంచి మూడు రోజులపాటు వర్సిటీని సందర్శించింది. బయోమెడికల్, బయో ఇన్ఫర్మాటిక్స్, సివిల్, కెమికల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్‌లకు మూడేండ్ల పాటు అక్రిడిటేషన్ ఇచ్చింది. ఈ సందర్భంగా యూనివర్సిటీలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో వైస్ చాన్స్‌లర్ కల్నల్ ప్రొఫెసర్ పి. నాగభూషణ్ మాట్లాడారు. ఎన్‌బీఏ అక్రిడిటేషన్ తో విజ్ఞాన్ బోధనా నాణ్యతకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని చెప్పారు.
ఇక ఇప్పటికే కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, ఈఈఈ, బయోటెక్నాలజీ, మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సులకు ఈ గుర్తింపు ఉందని పేర్కొన్నారు. అనంతరం విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య మాట్లాడారు. విజ్ఞాన్ యూనివర్సిటీ ఎల్లప్పుడు విద్యార్థుల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందని వెల్లడించారు. ప్రోగ్రామ్‌లకు టైర్–1 అక్రిడిటేషన్ రావడంతో విద్యార్థులకు అంతర్జాతీయ కంపెనీలలో ప్లేస్‌మెంట్లు సులభం అవుతాయన్నారు.
