Vanda Devullu: మరో సస్పెన్స్ థ్రిల్లర్తో విజయ్ ఆంటోనీ.. తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్

Vanda Devullu: మరో సస్పెన్స్ థ్రిల్లర్తో విజయ్ ఆంటోనీ..  తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్

‘బిచ్చగాడు’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత హీరో విజయ్ ఆంటోని, దర్శకుడు శశి కాంబినేషన్‌‌‌‌లో వస్తున్న చిత్రం ‘వంద దేవుళ్లు’. స్వాసిక హీరోయిన్‌‌‌‌. బుధవారం ఈ మూవీ రిలీజ్‌‌‌‌ డేట్‌‌‌‌ను అనౌన్స్ చేశారు. జూన్ 19న సినిమాను విడుదల చేయబోతున్నట్టు తెలియజేశారు.

ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌‌‌‌‌‌‌‌లో హీరోహీరోయిన్స్‌‌‌‌ కనిపిస్తున్న తీరును బట్టి ఇదొక పీరియాడికల్ డ్రామా అని అర్థమవుతోంది. ఫ్యామిలీ, ఎమోషన్స్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌‌‌‌తో వస్తున్న ఈ చిత్రానికి తెలుగులో భాష్య శ్రీ డైలాగ్ రైటర్‌‌‌‌గా వర్క్ చేశారు.

అజయ్, కావ్య, శక్తి, పదిని, కర్నాస్, బాలాజీ శక్తివేల్, దివాకర్, వినోదిని ఇందులో ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో  సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ మీద రామాంజనేయులు జవ్వాజి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.