‘మార్గాన్’ సినిమాలో లీడ్ రోల్ చేసిన దిషన్ హీరోగా 'బుకీ'

‘మార్గాన్’ సినిమాలో లీడ్ రోల్ చేసిన దిషన్ హీరోగా 'బుకీ'

అజయ్ దిషన్, ధనుష జంటగా గణేష్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం'బుకీ'. హీరో విజయ్ ఆంటోనీతో కలిసి  రామాంజనేయులు జవ్వాజీ నిర్మిస్తున్నారు. సోమవారం రామానాయుడు స్టూడియోస్‌‌‌‌‌‌‌‌లో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి సత్యదేవ్ క్లాప్ కొట్టగా, నిర్మాత సి.కళ్యాణ్ కెమెరా స్విచాన్ చేశారు. మంచు లక్ష్మి  స్క్రిప్ట్‌‌‌‌‌‌‌‌ను టీమ్‌‌‌‌‌‌‌‌ మెంబర్స్‌‌‌‌‌‌‌‌కు అందజేశారు. నిర్మాతలు విజయ్ ఆంటోని, రామాంజనేయులు గౌరవ దర్శకత్వం వహించారు. కమర్షియల్ కంటెంట్‌‌‌‌‌‌‌‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు విజయ్ ఆంటోనీ చెప్పాడు.

యూనివర్సల్‌‌‌‌‌‌‌‌గా అందరికీ అర్థమయ్యే కథతో ఈ సినిమా రూపొందుతోందని మంచు లక్ష్మి తెలిపారు. సునీల్, మంచు లక్ష్మి, పాండియరాజన్‌‌‌‌‌‌‌‌ లాంటి సీనియర్స్‌‌‌‌‌‌‌‌తో కలిసి నటించడం ఆనందంగా ఉందని హీరో అజయ్ దిషన్ చెప్పాడు.  విజయ్ ఆంటోని ‘డాక్టర్ సలీం’ చిత్రానికి డీవోపీగా పనిచేసిన తాను ఈ చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉందని దర్శకుడు చెప్పాడు. యూత్‌‌‌‌‌‌‌‌కు కనెక్ట్‌‌‌‌‌‌‌‌ అయ్యే కంటెంట్‌‌‌‌‌‌‌‌తో సందేశాత్మకంగా తెరకెక్కిస్తున్నామని నిర్మాత రామాంజనేయులు తెలియజేశారు.