
విజయ్ ఆంటోనీ ఆ మధ్య పోలీసు యూనిఫామ్ వేసి ‘రోషగాడు’గా వచ్చాడు. ఆ సినిమా అంతగా మెప్పించ లేదు. అయినా మరోసారి ఖాకీ డ్రెస్సులో రావడానికి రెడీ అవుతున్నాడు. అయితే ఈసారి సాదాసీదాగా రాడట. అసలు సిసలు కాప్‌లా కనిపిస్తాడట. ఎ.సెంథిల్ కుమార్ దర్శకత్వం లో ‘ఖాకీ’ మూవీలో నటిస్తున్నాడు విజయ్.
ఇదొక పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్. విజయ్ పవర్‌ఫుల్ పోలీసాఫీసరుగా కనిపించనున్నాడు. దాని కోసం అతడు సిక్స్ ప్యాక్ కూడా పెంచాడు. ఈమధ్యే రిలీజైన అతని ఫస్ట్ లుక్‌కి సోషల్ మీడియాలో మంచి స్పందనే లభిస్తోంది. అయితే విజయ్ ఆంటోనీది కూల్ ఫేస్. ఎంత టఫ్ రోల్స్ చేసినా ఒకలాంటి సాఫ్ట్‌నెస్ ఉంటుంది అతడిలో. మరి సిక్స్ ప్యాక్‌తో ఆ ఇంప్రెషన్ మారుస్తాడేమో చూడాలి!