Vijay Devarakonda: వీడీ-కోలా మాస్ తాండవం షురూ.. ఘనంగా ‘రౌడీ జనార్దన్‌’ పూజా ఈవెంట్

Vijay Devarakonda: వీడీ-కోలా మాస్ తాండవం షురూ.. ఘనంగా ‘రౌడీ జనార్దన్‌’ పూజా ఈవెంట్

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ ప్రాజెక్టు కోసం రెడీ అవుతున్నారు. ఈసారి సరికొత్తగా రూరల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో సినీ అభిమానుల ముందుకు రాబోతున్నారు. ఇవాళ శనివారం (అక్టోబర్ 11న) విజయ్ తన కొత్త మూవీ ‘రౌడీ జనార్ధన’ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.

‘‘ఒక వైల్డ్ బిగినింగ్: ప్రేమ - కోపం - రక్తం. సినీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండ- రవికిరణ్ మూవీ ఈరోజు పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. ఇక వీడీ-కోలా మాస్ తాండవం మొదలవ్వనుంది’’ అని మేకర్స్ ట్వీట్ చేస్తూ ఫోటోలు షేర్ చేశారు.

ఈ కార్యక్రమానికి సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్, అల్లు అరవింద్ హాజరయ్యారు. అక్టోబర్ 16 నుంచి చిత్ర బృందం ముంబైలో రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించనుంది.

‘రౌడీ జనార్ధన’:

రూరల్ యాక్షన్ ఎంటర్‌టైనర్గా ‘రౌడీ జనార్ధన’ తెరకెక్కుతుంది. కిరణ్ అబ్బవరం నటించిన ‘రాజావారు రాణిగారు’తో సూపర్ సక్సెస్ అందుకున్న రవికిరణ్ కోలా మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో నిర్మాత దిల్ రాజు మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా కీర్తి సురేశ్‌ నటిస్తోంది. వీరిద్దరి కలయికలో ఇది ఫస్ట్ మూవీ. ఈ క్రమంలో రౌడీ జనార్ధనపై సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

డైరెక్టర్ రవికిరణ్ కోలా..‘రాజా వారు రాణి గారు’ క్లాసిక్ లవ్ స్టోరీతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఒక సున్నితమైన ప్రేమకథ తీసిన దర్శకుడు, ఇప్పుడు విజయ్‌తో భారీ యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో విజయ్ పాత్ర చాలా డిఫరెంట్గా ఉండనుందని టాక్. అంతేకాదు మునుపెన్నడూ కనిపించని సరికొత్త  అవతారంలో కనిపించనున్నాడట విజయ్. చూడాలి విజయ్ కు సక్సెస్ వరిస్తుందా లేదా? అనేది చూడాలి.