విజయ్ దేవర కొండ మరో సెన్సేషన్

V6 Velugu Posted on Jun 15, 2021

విజయ్ దేవరకొండకి నేషనల్ వైడ్ ఉన్నక్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈమధ్యనే మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్టులో సెకెండ్ ప్లేస్ల్ లో నిలిచాడు. తనిప్పుడు మరో క్రెడిట్ సాధించాడు. పాపులర్ బాలీవుడ్ సెలెబ్రిటీ ఫొటోగ్రాఫర్ డబూ రత్నాని క్యాలెండర్లో చోటు సంపాదించాడు. సౌత్ ఇండియా నుండి ఈ క్యాలెండర్లో చోటు సంపాదించిన మొదటి హీరో విజయ్ దేవరకొండ కావడం విశేషం. దీనికి సంబంధించిన స్టన్నింగ్ పోస్టర్ ను రిలీజ్ చేశాడు డబూ. స్టైలిష్ లుక్ లో  చాలా హ్యాండ్ సమ్ గా కనిపిస్తున్నాడు విజయ్. కాస్త రగ్డ్ గానూ ఉన్నాడు. ఈ పోస్టర్ ను లాంచ్ చేసిన సందర్భంగా విజయ్ తో ఇన్ స్టాగ్రామ్ లో ముచ్చటించాడు డబూ. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ ‘ఈ ఫోటో షూట్ చాలా ఫాస్ట్ గా జరిగింది. ఔట్ ఫుల్ చాల క్వాలిటీగా వచ్చింది. కొన్నేళ్ల నుండి నాకు నచ్చిన ఎంతోమంది స్టార్స్ మీ క్యాలెండర్ లో కనిపించారు. షారుఖ్ సర్ ను కూడా మీ క్యాలెండర్ లో చూశా. ఆయన చాలా మంచి వ్యక్తి. అప్పట్నుంచి నేను కూడా మీ క్యాలెండర్ లో కనిపిస్తే బాగుంటుంది అనుకునేవాడిని. నేను షూట్ చేసిన బెస్ట్ డెబ్యూ ఫొటోషూట్ కూడా మీదే. థాంక్యూ’ అని చెప్పాడు.

Tagged Vijay Devarakonda, Calendar, Bollywood famous photographer Dabu Ratnani

Latest Videos

Subscribe Now

More News