చిన్న చిన్న నాటకాల్లో నటించిన విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)..రౌడీ బాయ్గా, స్టార్ భాయ్గా సినిమాల్లో మంచి గుర్తింపు పొందారు. నువ్విలా, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి సినిమాల్లో అతిధి పాత్రల్లో నటించిన విజయ్..పెళ్లి చూపులు మూవీతో తెలుగు ఇండస్ట్రీని, అర్జున్ రెడ్డితో ఇండియా వైడ్గా ఫ్యాన్స్ని సొంతం చేసుకున్నాడు.అంతేకాదు..తన సోషల్ మీడియా ఖాతాలో కూడా మంచి గుర్తింపు పొందాడు.
లేటెస్ట్గా విజయ్ దేవరకొండ డైరెక్టర్ పరుశురాం తెరకెక్కించిన ఫ్యామిలీ స్టార్ మూవీ ఇవాళ (ఏప్రిల్ 5న) థియేటర్స్ లో రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమా చూసాక ప్రతిఒక్కరూ తమ ఫ్యామిలీ కోసం ఎలా నిలబడాలో చూసాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే విజయ్ ఈ సినిమా రిలిజ్ కు ముందు రోజు తన ఇంస్టాగ్రామ్ లో చేసిన పోస్ట్ ఆకట్టుకుంటుంది.
"నా హీరో, నా స్టార్.ఆయన మా కోసం, ఫ్యామిలీ కోసం ఎన్నో త్యాగాలు చేశారు. తన సంతోషాన్ని వదులుకున్నారు. ఎప్పుడైనా తప్పు చేసి ఉంటే క్షమించండి నాన్నా. నేను ఈ రోజు ఇలా ఈ స్థాయిలో ఉన్నానంటే మీరే కారణం నాన్నా"..కుటుంబం కోసం కష్టపడే ప్రతి వ్యక్తికీ ఈ ఫ్యామిలీ స్టార్ సినిమా అంకితం అంటూ ఎమోషనల్ అయ్యారు విజయ్.
తన తండ్రి గర్వపడేలా..ఈరోజు ఒక స్టార్ట్ గా ఎదిగి..మీరు ప్రతిక్షణం హ్యాపీగా ఉండేలా ప్రయత్నిస్తాను..పోరాడతాను అన్నారు. ఇక ఈ పోస్ట్ లో విజయ్ వాళ్ళ నాన్నతో దిగిన చిన్న నాటి ఫోటోలను, తండ్రితో ఉన్న మెమోరీస్ ను వీడియో రూపంలో సోషల్ మీడియాలో పంచుకోవడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఆ వీడియోలో యంగ్ గా ఉన్న గోవర్ధన్ రావును చూస్తుంటే అచ్చం విజయ్ దేవరకొండలానే కనిపిస్తున్నారు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గ్రేట్ ఫాదర్..విత్ గుడ్ సన్ అంటున్నారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.కెయు మోహనన్ సినిమాటోగ్రాఫర్‌గా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు గోపి సుందర్ మ్యూజిక్ అందించారు.