విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), సమంత జంటగా శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ ఖుషి. ఈ మూవీ బాక్సాపీస్ వద్ద యావరేజ్ హిట్ గా నిలిచింది. ఇక విజయ్ నుంచి రాబోయే మూవీస్ పైన ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ పెరిగింది. ప్రస్తుతం విజయ్ గీత గోవిందం డైరెక్టర్ పరశురాం తో మూవీ చేస్తున్నాడు. ఈ మూవీకి ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది.
ALSO READ : ఆర్జీవీ వెతుకుతున్న అమ్మాయి దొరికేసింది.. ఆఫర్ కూడా ఇచ్చేశాడు
ఇక లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ మరో మూవీ చేయబోతున్నట్లు సమాచారం. ఈ మూవీని రాజావారు రాణిగారు ఫేమ్ డైరెక్టర్ రవి కిరణ్ కోల( Ravi Kiran Kola) తో డైరెక్షన్ లో చేయబోతున్నట్లు టాక్. రీసెంట్ గా డైరెక్టర్ రవి కిరణ్ ట్విట్టర్ లో తన సెకండ్ మూవీ అప్డేట్ ఇచ్చారు.ఈ మూవీని దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కిస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ లో హీరో ఎవరనేది రివీల్ చేయలేదు. ఇన్ సైడ్ సినీ రిపోర్ట్స్ ప్రకారం ఈ ప్రాజెక్ట్‌లో హీరో విజయ్ దేవరకొండనే అని టాక్ వినిపిస్తుంది.
ఈ ప్రాజెక్ట్..స్టోరీ విషయానికి వస్తే..ఇదొక డిఫరెంట్ గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే స్టోరీ అని తెలుస్తోంది. ఇందులో హీరో క్యారెక్టరైజేషన్ స్పెషల్గా ఉండనున్నట్లు టాక్. అంతేకాకుండా ఇందులో ఓ క్యూట్ లవ్ స్టోరీని చూపించడానికి డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నారట.
ప్రసెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ మూవీ..త్వరలో షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక వీలైనంత త్వరగా షూటింగ్‌ను కంప్లీట్ చేసి వచ్చే ఏడాది (2024 లో) ప్రథమార్థంలో సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ ప్రాజెక్ట్ నుంచి త్వరలో మరిన్ని విషయాలు ప్రకటించే అవకాశం ఉంది.
I am Very Delighted to share this announcement along with @SVC_official. I feel humble and greatful for this collaboration with #DilRaju garu and #Sirish garu. I know I have taken a lot of time to break this news, such is the price we’ve paid for the Vicious Dynamite we are… https://t.co/Ovq9UNiJLy
— Ravi Kiran Kola (@storytellerkola) September 25, 2023