కుటుంబానికి అండగా నిలబడే ఫ్యామిలీ స్టార్

కుటుంబానికి అండగా నిలబడే ఫ్యామిలీ స్టార్

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. ఏప్రిల్ 5న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా సోమవారం ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్‌‌ నిర్వహించారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ‘మనకు ఏ కష్టం వచ్చినా అండగా నిలబడి నేనున్నా అని ధైర్యం చెప్పే వ్యక్తి ప్రతి ఫ్యామిలీలో ఒకరు ఉంటారు. ఆ ఒక్కరే ఫ్యామిలీ స్టార్. మా కుటుంబంలో మా నాన్న ఫ్యామిలీ స్టార్. డైరెక్టర్ పరశురామ్ ఈ కథ చెప్పినప్పుడు  నాన్న గోవర్థన్ గుర్తొచ్చాడు. ఫ్యామిలీ కోసం ఆయన పడిన తపన గుర్తుకు వచ్చింది.  

అందుకే ఈ సినిమాలో హీరో క్యారెక్టర్‌‌‌‌కు గోవర్థన్ అనే పేరు పెట్టమని చెప్పాను. ఎందుకంటే ఆ పేరు పెట్టుకున్న తర్వాత ఎమోషన్స్ పలికించడం సులువు అవుతుంది. ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యేలా సినిమా ఉంటుంది’ అని చెప్పాడు. మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ ‘ఇందులో  గోవర్థన్, ఇందూ, బామ్మ ఇతర క్యారెక్టర్స్ మధ్య బ్యూటిఫుల్ స్టోరీ ఉంటుంది. మన జీవితాల్లోని ఎమోషన్స్, రిలేషన్స్, అచీవ్‌‌మెంట్స్, స్ట్రగుల్స్ అన్ని  

ఈ మూవీలో అందరూ రిలేట్ చేసుకుంటారు’ అని చెప్పింది. దిల్ రాజు మాట్లాడుతూ ‘ఇందులో విజయ్ నవ్విస్తాడు, ఏడిపిస్తాడు, ఫైట్ చేస్తాడు, ఫ్యామిలీ కోసం ఆలోచిస్తాడు, అమ్మాయిని ప్రేమిస్తాడు, ఆమెను ద్వేషిస్తాడు, రొమాన్స్ చేస్తాడు..ఇలా అన్ని షేడ్స్ తన క్యారెక్టర్‌‌‌‌లో ఉన్నాయి. కుటుంబానికి అండగా నిలబడే ప్రతి ఒక్కరూ  ఫ్యామిలీ స్టార్స్ అని చెప్పడమే ఈ సినిమా ఉద్దేశం’ అని చెప్పారు