రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటించిన లేటెస్ట్ మూవీ ది ఫ్యామిలీ స్టార్(The Family star) ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత కొంతకాలంగా సరైన హిట్టు లేక బాధపడుతున్న విజయ్ ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు. అదే రేంజ్ లో ప్రమోషన్స్ కూడా చేశాడు. దాంతో.. సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. తీరా.. సినిమా చూశాక ఆడియన్స్ నుండి మాత్రం మిక్సుడ్ టాక్ వచ్చింది. కథలో కొత్తదనం లేదని, రొటీన్ సినిమానే ప్రేక్షకుల మీదకు వదిలారని కామెంట్స్ విపించాయి.
ఆ ఎఫెక్ట్ సినిమా కలెక్షన్స్ మీద పడింది. ఇక ది ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రీ బిజినెస్ విషయానికి వస్తే.. నైజాం రూ.13.00 కోట్లు, సీడెడ్ రూ. 4.50 కోట్లు, ఆంధ్రప్రదేశ్ అన్ని ప్రాంతాల్లో కలిపి రూ.17.00 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. ఇక మిగతా భాషల్లో కలిపి రూ.3 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.50 కోట్లు కలిపి.. మొత్తంగా ఈ సినిమాకు రూ. 43 కోట్లు బిజినెస్ జరిగింది.
ఇక రూ.45 కోట్ల టార్గెట్ తో వచ్చిన ఈ సినిమాకు మొదటిరోజు డీసెంట్ కలెక్షన్స్ వచ్చాయని చెప్పాలి. సినిమాకు ఆడియన్స్ నుండి మిక్సుడ్ టాక్ రావడంతో మొదటిరోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 6.00 కోట్లు, వరల్డ్ వైడ్‌గా రూ. 8.20 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. నిజానికి విజయ్ దేవరకొండ స్టామినాకి ఇది చాలా అంటే చాలా తక్కువ అని చెప్పుకోవాలి. కానీ, ఆయన నుండి వచ్చిన గత సినిమాలు డిజాస్టర్స్ గా నిలువడం, ఈ సినిమాకు కూడా మిక్సుడ్ టాక్ రావడంతో ఆ ప్రభావం కలెక్షన్స్ పై పడింది. కనీసం.. దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో అయినా విజయ్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాడేమో చూడాలి.