Family Star OTT: మరో రెండు రోజుల్లో ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్..స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Family Star OTT: మరో రెండు రోజుల్లో ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్..స్ట్రీమింగ్ ఎక్కడంటే?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay devarakonda), సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్(Mrunal thakur) జంటగా వచ్చిన లేటెస్ట్ మూవీ ది ఫ్యామిలీ స్టార్(The Family Star). దర్శకుడు పరశురామ్(Parasuram) తెరకెక్కించిన ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు(Dil Raju) నిర్మించారు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా మర్చి 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

విడుదలకు ముందు మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా రిలీజ్ తరువాత మాత్రం ఆ అంచనాలను అందుకోలేకపోయింది. రొటీన్ స్టోరీ, కథనం కూడా కొత్తగా లేకపోవడంతో ఆడియన్స్ ఈ సినిమాను రిజెక్ట్ చేశారు.దీంతో బాక్సాఫీస్ వద్ద మినిమమ్ కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయింది.

అయితే ఆడియన్స్ నుంచి సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చూసి ది ఫ్యామిలీ స్టార్ ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను ముందుగా మే 3నుండి స్ట్రీమింగ్ చేయాలని డిసైడ్ అయ్యారు. కానీ, నెలలోపే ఈ సినిమాను ఓటీటీలోకి రాబోతుందని టాక్.

అందుకు ఈ నెల ఏప్రిల్ 26న ఫ్యామిలీ స్టార్ ఓటీటీలోకి రానుంది.ఇదే విషయంపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రానుంది.దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి థియేటర్స్ లో డిజాస్టర్ గా నిలిచిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేతిలో మూడు సినిమాలు లైన్ లో ఉన్నాయి.