కళ్లలో ప్రేమ-పగ.. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఫస్ట్ లుక్

కళ్లలో ప్రేమ-పగ.. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఫస్ట్ లుక్

అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండకు వచ్చిన ఇమేజ్ అంతా ఇంతాకాదు. ఆయన్నో స్టార్ ను చేసేసింది. యూత్ ఐకన్ గా మార్చేసింది. సిన్సియర్ లవర్ గా.. లవ్ లోని డెప్త్ ను చూపించిన ఈ తరం దేవదాసు అర్జున్ రెడ్డి. తెలుగులో కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయిన అర్జున్ రెడ్డిలాంటి .. ప్రేమ గాఢత ఉన్న సినిమాలో విజయ్ దేవరకొండ నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ పేరుతో విజయ్ దేవరకొండ కొత్త సినిమా ప్రకటించగానే.. మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. ఇపుడు లేటెస్ట్ గా ఆ మూవీ ఫస్ట్ లుక్ రిలీజైంది. అంతే… ఆ ఫొటోతో.. అర్జున్ రెడ్డి మ్యాజిక్ రిపీట్ కాబోతోందా అన్న అంచనాలు మొదలయ్యాయి.

గడ్డం, హెవీ తలకట్టు, సిగరెట్.. ఇలా… భగ్న ప్రేమికుడి గెటప్ లో విజయ్ దేవరకొండ నటన అభిమానుల గుండెల్లో ప్రింటైపోయింది. అదే గెటప్ లో… వరల్డ్ ఫేమస్ లవర్ దిగిపోయాడు. ఐతే.. ముఖంపై రక్తగాయాలతో ..  కోపంలో సిగరెట్ ను దూరంగా విసిరేస్తున్నట్టున్న స్టిల్ ను ఫస్ట్ లుక్ గా చూపించారు. కసితో రగిలిపోయే హీరో… సిగరెట్ విసిరేస్తూ.. ఎవరినో బతికుండగానే చంపేస్తున్నట్టున్న సన్నివేశం ఇది అని అంచనా వేస్తున్నారు.

రాశిఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, క్యాథరిన్ త్రెసా, ఇసబెల్లే లీట్ ఈ మూవీలో లీడ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై వస్తున్న 44వ సినిమా ఇది. విజయ్ దేవరకొండ చేస్తున్న 9వ సినిమా ఇది. గోపీసుందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. క్రాంతి మాధవ్ దర్శకుడు.