Vijay Devarakonda: ఇంత కసా.. ఇంత ఓర్వలేని తనమా.. విజయ్‌ మేనమామ షాకింగ్ కామెంట్స్

Vijay Devarakonda: ఇంత కసా.. ఇంత ఓర్వలేని తనమా.. విజయ్‌ మేనమామ షాకింగ్ కామెంట్స్

రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటించిన లేటెస్ట్ మూవీ ది ఫ్యామిలీ స్టార్(The Family Star). బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను పరశురామ్(Parasuram) పెట్ల తెరకెక్కించారు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సాధించింది. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను బాగానే ఆదరిస్తున్నా..  కొంతమంది మాత్రం కావాలని సినిమాపై నెగిటీవ్ ను స్ప్రెడ్ చేస్తున్నారు. ఈ విషయంపై దిల్ రాజు ఆగ్రహం వ్యక్తం చేయగా.. తాజాగా విజయ్ దేవరకొండ మేనమామ యష్ రంగినేని స్పందించారు. 

సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన సుదీర్ఘమైన పోస్ట్ రాసుకొచ్చారు.. ఎందుకురా బాబు మా వాడి వెంటపడ్డారు. ఇంత కసా? ఇంత ఓర్వలేని తనమా? లేక భయమా? మంచి విలువలతో, సందేశంతో, ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయాల్సిన సినిమాని కూడా వదలటం లేదుగా. మీ నెగటివ్ బ్యాచ్‌కు విజయ్ దేవరకొండ అంటే పడదు. కనీసం ఇష్టపడేవాళ్లని కూడా సినిమాకి రాకుండా చేస్తున్నారేంటిరా బాబు. అయినా.. మిగతా హీరోల సినిమాలకు కనిపించని లాజిక్స్.. మావోడి సినిమాలకి మాత్రం కనిపిస్తున్నాయి. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ వచ్చి మంచి హీరోగా పేరుతెచ్చుకోవడం తప్పా?.. అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు ఆయన. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఇక ఇదే విషయంపై వైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు విజయ్ దేవరకొండ పర్సనల్ మేనేజర్. ది ఫ్యామిలీ స్టార్ సినిమాపై కావాలనుఈ నెగిటీవ్ పోస్టులు పెట్టిన కొంతమందిపై ఫిర్యాదు కూడా చేశారు. వారు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.