రణబాలి’ నుంచి సర్‌ప్రైజ్.. నాలుగు ఎపిసోడ్ల డాక్యుమెంటరీ సిరీస్

రణబాలి’ నుంచి సర్‌ప్రైజ్.. నాలుగు ఎపిసోడ్ల డాక్యుమెంటరీ సిరీస్

 

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ  ‘రణబాలి’.  మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 16న విజయదశమి సందర్భంగా వరల్డ్ వైడ్‌‌గా థియేటర్లలో విడుదల కానుంది.  తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ఆసక్తికరమైన అనౌన్స్‌‌మెంట్ చేశారు.

‘రణబాలి: నెవర్ ఫర్గెట్ ది ట్రూత్’  పేరుతో నాలుగు ఎపిసోడ్ల డాక్యుమెంటరీ సిరీస్‌‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు ప్రకటించారు.   ఇందులో భాగంగా సెప్టెంబర్ 28న  ‘ది ఫెమైన్ వి ఫర్గాట్’,  సెప్టెంబర్ 30న  ‘ది హిస్టరీ వి ఫర్గాట్’,  అక్టోబర్ 2న  ‘ది మెన్ వి ఫర్గాట్’  ఎపిసోడ్లు యూట్యూబ్‌‌లో స్ట్రీమింగ్ కానున్నాయని తెలియజేశారు.  నాలుగో ఎపిసోడ్  ‘ది లాస్ట్ లోడ్’  విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు.  ‘చరిత్రకు రెండు భాగాలు ఉన్నాయి.. ఒకటి మనకు చెప్పింది, మరొకటి మరుగునపడిన నిజం’ అనే కాన్సెప్ట్‌‌తో ఈ సిరీస్‌‌ను రూపొందిస్తున్నారు.  ‘రణబాలి’ ప్రపంచం నుంచి ఎక్స్‌‌క్లూజివ్ బిహైండ్ ది సీన్స్ కంటెంట్‌‌తో పాటు చరిత్రలో మరుగునపడ్డ అంశాలను ఈ డాక్యుమెంటరీ సిరీస్‌‌లో చూపించనున్నారు.