బెట్టింగ్ యాప్ కేసు మరో కొత్త మలుపు తీసుకుంది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో భాగంగా నటులు విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ లకు తెలంగాణ CID అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇవాళ మంగళవారం (2025 నవంబర్ 11న) మధ్యహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాల్సిందిగా ఆ ఇద్దరికి ఆదేశాలు జారీ చేశారు.
ఈ మేరకు హీరో విజయ్ దేవరకొండ.. బషీర్ బాగ్ లోని CID కార్యాలయంలో విచారణకు హాజరు అయ్యారు. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ముందస్తుగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
►ALSO READ | Allu Arjun: ఢిల్లీ పేలుడుపై అల్లు అర్జున్ సంతాపం.. షాకింగ్‌గా ఉందంటూ ఎమోషనల్ పోస్ట్!
మనీలాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల కింద వారిని ప్రశ్నించనున్నట్లు సమాచారం. బెట్టింగ్ యాప్ ల నుంచి తీసుకున్న పారితోషికాలు, కమిషన్ లపై అరా తియ్యనున్నారు CID అధికారులు. చట్టవిరుద్ధమైన యాప్ లకు ప్రమోషన్ ఎందుకు చెయ్యాల్సి వచ్చింది..? అనే కోణంలో కూడా CID విచారించి.. వీరి స్టేట్‌మెంట్‌లను రికార్డు చేయనుంది.
ఇకపోతే, ఇటీవలే బెట్టింగ్ యాప్స్ కేసులో తెలంగాణ CID కీలక ఆపరేషన్ చేపట్టింది. మరి ఈ విచారణ అనంతరం విజయ్ దేవరకొండ ఎలా స్పందిస్తాడో తెలియాల్సి ఉంది.
