స్ప్రై యాక్షన్ థ్రిల్లర్ లో విజయ్ దేవరకొండ..

స్ప్రై యాక్షన్ థ్రిల్లర్ లో విజయ్ దేవరకొండ..

లైగర్ బాయ్ విజయ్ దేవరకొండ, జెర్సీ" ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో "VD12" చిత్రం రాబోతుంది. ఈ మూవీకి సంబంధించి లెటెస్ట్ అప్ డేట్ ను స్వయంగా చెప్పాడు ఈ యంగ్ హీరో. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం అవుతుంది అంటూ.. గన్ పేలుస్తున్న పోస్టర్ ను విడుదల చేయటం ద్వారా.. రాబోయే కొత్త సినిమాపై హైప్ క్రియేట్ చేశారు విజయ్. 

విజయ్ దేవరకొండ అంటే లవర్ బాయ్ గానే కాదు.. యాక్షన్ హీరో అనే రేంజ్ లో ఉంది ఈ పోస్టర్. షూట్ బిగిన్స్ అనే క్యాప్షన్ ఇస్తూ.. అభిమానులకు హ్యాపీ న్యూస్ చెప్పారు. మరో పోస్టర్ కూడా ఆసక్తిగానే ఉంది. పోలీస్ టోపీ పెట్టుకుని.. ముఖానికి నల్ల గుడ్డ కట్టుకున్నాడు. దీనికి "నేను ఎవరికి ద్రోహం చేశానో చెప్పడానికి.. నేను ఎక్కడ ఉన్నానో నాకు తెలియదు.. నేనొక అనామక గూఢచారి అంటూ రాసుకొచ్చిన డైలాగ్.. ఈ చిత్రంపై మరింత ఆసక్తి కలిగేలా చేశాయి. 

"VD12" స్ప్రై యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ధమాకాతో తన పర్సటాలిటీని ప్రూవ్ చేసుకున్న టాలెంటెడ్ బ్యూటీ శ్రీలీలతో పాటు, సీతారామంతో అందరి మనసులని  గెలిచిన మృణాల్ ఠాకూర్‌.. విజయ్ కు జోడీగా నటించబోతున్నారు. 

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు పాన్ ఇండియా లెవెల్లో నిర్మిస్తున్న ఈ మూవీకి.. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.